For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరీ అంత దుర్భర పరిస్థితుల్లో లేను.. ఎవ్వరినీ ఆర్థిక సాయం అడగలేదు.. నటి శివ పార్వతి కామెంట్స్

  |

  నటి శివ పార్వతి- వదినమ్మ సీరియల్ యూనిట్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి తెలిసిందే. తాను కరోనా బారిన పడ్డాక ఒక్కసారి కూడా పలకరించలేదని, కనీసం ఎలా ఉన్నానో అని కూడా సమాచారం కనుక్కోవడం లేదని శివ పార్వతి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. శివ పార్వతి పెట్టిన వీడియోపై నటుడు ప్రభాకర్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగిందో చెబుతో ప్రభాకర్ ఓ వీడియోను షేర్ చేశారు.

  అందుకే అలా మాట్లాడారు..

  అందుకే అలా మాట్లాడారు..

  తనను పట్టించుకోలేదని, క్షేమ సమాచారాలు కూడా కనుక్కోలేదని వాపోయిన శివ పార్వతి ఆరోపణలపై ప్రభాకర్ స్పందించాడు. శివ పార్వతమ్మకు కరోనా వచ్చిన తరువాత ఆమెను చూసింది ఆ వీడియోలోనే అని చెప్పుకొచ్చాడు. తాను, వదినమ్మ సీరియల్ మేనేజర్ శివ పార్వతమ్మ అబ్బాయికి టచ్‌లో ఉన్నాం.. ఆ విషయం ఆమెకు తెలియకుండా ఆ వీడియో పెట్టింది. జరిగిన విషయం తెలిసి అమ్మ క్షమించమని అడిగినట్టుగా పేర్కొన్నాడు. ఏది ఏమైనా ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం కోలుకోవాలి, తరువాత ఈ విషయంపై మళ్లీ తాము క్లారిటీ ఇస్తామని ప్రభాకర్ తెలిపాడు.

  తాజాగా మరో వీడియో..

  తాజాగా మరో వీడియో..

  తాజాగా శివ పార్వతి మరో వీడియోను వదిలారు. అందరికీ నమస్కారమండి.. నేను శివపార్వతిని.. గత రెండు రోజులుగా యూట్యూబ్ ఛానల్స్‌లో నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, చానెల్స్‌లో చూసి ఆందోళనగా.. నాకు ఇష్టమైన వాళ్లు..నన్నుఇష్టపడేవాళ్లు..ఫ్రెండ్స్, బంధువులు, అభిమానుందరూ ఫోన్స్ చేస్తున్నారు. వారికి చాలా కృతజ్ఞతలని చెప్పుకొచ్చారు.

  అటువంటి పరిస్థితుల్లో లేను..

  అటువంటి పరిస్థితుల్లో లేను..

  అయితే అటువంటి దారుణ పరిస్థితుల్లో నేనేమీ లేను బాగున్నాను. ఈ కరోనా నేను ఒక్కదాన్నే కాదు ప్రపంచం మొత్తం ఎదుర్కోంటోంది. అందులో నేను ఉన్నాను. చానెల్స్‌లో చూపినట్టు నేను చావుబతుకుల్లో ఉన్నాను కాపాడండి ప్రాధేయ పడి అడగలేదు. ఆర్థిక సాయం కోసం ఎవ్వరినీ అడగలేదు.. దేవుడి దయ వల్ల నాకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు అని

  పర్సనల్‌గా పెట్టిన వీడియో..

  పర్సనల్‌గా పెట్టిన వీడియో..

  అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సభ్యులు, మా గురువులు తండ్రి సమానులు పరుచూరి బ్రదర్స్ ఎప్పుడూ నాకు ఫోన్‌లో అందుబాటులో ఉన్నారు. కష్టసుఖాలు పంచుకున్నాను.. అంతా బాగానే ఉంది. నన్నెవరూ ఆదరించని పరిస్థితుల్లో లేను..నేను పని చేసిన ఓ ప్రొడక్షన్ హౌస్ మాట్లాడలేదని, వారికి ఓ పర్సనల్ వీడియో పెడితే అది యూట్యూబ్‌లో వేరే వేరే టైటిల్స్ ద్వారా బయటకు వెళ్లి మా మధ్య మనస్పర్దాన్ని కలగజేసింది అని శివ పార్వతి చెప్పుకొచ్చారు.

  Adah Sharma Is Excited About Her New Film | రెండు చిత్రాలకు సైన్ చేసిన బ్యూటీ
   దుర్భర పరిస్థితుల్లో లేను..

  దుర్భర పరిస్థితుల్లో లేను..

  ఎదుటి వాళ్లు రెస్పాండ్ కావాల వద్దా అనేది వారి సంస్కారానికే వదిలేస్తున్నా.. కాకపోతే కలిసి పని చేశాం నా హక్కుగా పలకరించలేదని బాధపడ్డాను ఆ వీడియో పెట్టాను. అంతే తప్ప అవసాన దశ, దుర్భర పరిస్థితుల్లో లేను. .నేను బాగానే ఉన్నాను.. నా ఆరోగ్యం కాపాడుకునే పరిస్థితుల్లే ఉన్నా... మాట సాయం చేసినా దేవుడిలానే చూస్తాను.. ఇండస్ట్రీ వారంతా సాయం చేశారు. ఆర్థికంగా కాదు మాట సాయం బలంగా చేశారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జీవిత రాజశేఖర్ గారు సాయం చేశారు. నేనే కాదు ఇండస్ట్రీలో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా సాయం చేస్తారు.. మళ్లీ మీ అందరి ముందు యాక్టివ్‌గా రావాలని కోరుకుంటున్నాను.. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. నాకు అంతే చాలు అంటూ శివ పార్వతి వీడియోను ముగించారు.

  English summary
  Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media. she is not in crtical position as circulated in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X