For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫేమస్ షోలో కలకలం: హైపర్ ఆదిపై చేయి చేసుకున్న హీరోయిన్.. ఆ మాట అనడం వల్లే!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్లు మరింత పాపులారిటీని సొంతం చేసుకుని దూసుకుపోతోన్నారు. అందులో పంచ్‌ డైలాగుల స్పెషలిస్టుగా పేరొందిన హైపర్ ఆది ఒకడు. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన అతడు.. వరుస షోలతో సందడి చేస్తోన్నాడు. ఫలితంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆదిపై హీరోయిన్ చేయి చేసుకుంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  జబర్ధస్త్‌గా సాగుతోన్న ఆది కెరీర్

  జబర్ధస్త్‌గా సాగుతోన్న ఆది కెరీర్


  సినిమా స్ఫూఫ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఆది జబర్ధస్త్‌ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా అతడి కెరీర్ జబర్ధస్త్‌గా సాగుతోంది.

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  మూవీల్లోనూ... రైటర్‌గానూ సత్తా

  మూవీల్లోనూ... రైటర్‌గానూ సత్తా

  జబర్ధస్త్ షో వల్ల హైపర్ ఆది కెరీర్‌ దిగ్విజయంగా సాగుతోంది. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్‌ చేశాడు. అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' మూవీతో డైలాగ్ రైటర్‌గానూ మారాడు.

  జబర్ధస్త్‌ రీఎంట్రీ.. ఆ షోలలోనూ

  జబర్ధస్త్‌ రీఎంట్రీ.. ఆ షోలలోనూ


  జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలం పాటు ఆ షోలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత అతడు షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరింత హైలైట్ అవుతున్నాడు.

  రష్మిక మందన్నా ఎద అందాల విందు: ఆమెనింత ఘోరంగా ఎప్పుడైనా చూశారా!

  ఢీ షో బాధ్యత తీసుకున్నాడు

  ఢీ షో బాధ్యత తీసుకున్నాడు

  సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, రష్మీ వెళ్లిపోయిన తర్వాత పడిపోయిన ఈ షోను.. ఆది తన కామెడీతో విజయవంతం చేయాలని ట్రై చేస్తున్నాడు.

  వాళ్ల వల్ల పొరపాటు పడిన ఆది

  వాళ్ల వల్ల పొరపాటు పడిన ఆది


  వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'ఢీ' 14వ సీజన్ ఎపిసోడ్‌ గెటప్‌ల స్పెషల్‌గా రాబోతుంది. ఇది గతంలో వాటి కంటే మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. ఇందులో ఓ హాట్ పెర్ఫార్మెన్స్ తర్వాత హైపర్ ఆది.. జడ్జ్‌లలో ఒకరైన శ్రద్దా దాస్‌ను ముద్దు అడగబోయాడు. దీనికి యాంకర్ ప్రదీప్ 'థప్పడ్' అని చెప్పడంతో ఆది పొరబడ్డాడు.


  లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

  హీరోయిన్‌ను కావాలని అడిగి

  హీరోయిన్‌ను కావాలని అడిగి

  'ఢీ' షోలో జడ్జ్‌గా సందడి చేస్తోన్న శ్రద్దా దాస్‌ను ముద్దు ఇవ్వమనిబోయి 'థప్పడ్' ఇవ్వు అని హైపర్ ఆది అడిగాడు. అంతలో పక్కన వాళ్లు వచ్చి ఒకటి కాదు రెండు అడుగు అని చెప్పారు. దీంతో హైపర్ ఆది 'దో థప్పడ్ దేవో' అని అడిగాడు. ఆ వెంటనే కళ్లు మూసుకుని కూర్చున్నాడు. అంతే.. శ్రద్దా రెండు చెంపలపై చెల్లుమని దెబ్బలు వేసింది. దీంతో అతడు షాక్ అయ్యాడు.

  ఇంకోటి ఇవ్వడంతో ఝలక్

  ఆ తర్వాత హైపర్ ఆది 'ముద్దు అంటే థప్పడ్ అని చెప్పింది ఎవడ్రా. అసలు ముద్దును ఏమంటారో చెప్పండి' అని అడిగాడు. దీంతో ఆనీ మాస్టర్ 'గూసా' అని చెప్పింది. ఆ వెంటనే అతడు 'అరగంట సేపు గూసా కావాలి' అని అడిగాడు. దీంతో శ్రద్దా అతడి ఛాతిపై చేత్తో గుద్దులు వేసింది. దీంతో మళ్లీ ఆది షాక్ అయ్యాడు. ఇదంతా ఫన్నీగా జరగడంతో అంతా నవ్వేశారు.

  English summary
  Jabardasth Comedian Hyper Aadi Paticipated in Dhee Show. Actress Shraddha Das Slap Him in This Show An Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X