Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Veena Kapoor: నటి వీణా హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. బతికే ఉన్నానంటూ పోలీసుల ముందు!
ఇటీవల కాలంలో వచ్చే వార్తలను వెంటనే నమ్మరాకుండా ఉంది. వివాహాలు, అఫైర్స్, ప్రేమయణాలు, బ్రేకప్ లే కాకుండా హత్యలకు సంబంధించిన వార్తలు కూడా పుకార్లుగా నిలుస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ సీనియర్ నటి వీణా కపూర్ హత్య. హిందీ చిత్రసీమకు చెందిన వీణా కపూర్ ను ఇటీవల ఆమె కొడుకు హత్య చేశాడన్న వార్తలు తెగ హాట్ టాపిక్ అయ్యాయి. తల్లిని కన్న కొడుకు ఎలా చంపాడు అని ఎంతోమంది ఆలోచించారు. కానీ తాజాగా ఈ హత్య కేసులో కొత్త ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నిజానికి వీణా కపూర్ ను ఆమె కొడుకు చంపలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె అసలు చనిపోనేలేదు. అసలు విషయం ఏంటో ఓ లుక్కేద్దామా!

పోలీసులకు ఫిర్యాదు..
ఆస్తి కోసం సీనియర్ నటి వీణా కపూర్ ను తన కన్నకొడుకే హత్య చేశాడంటూ ఇటీవల జాతీయ స్థాయిలో తెగ వార్తలు వచ్చాయి. దీంతో నటి వీణా కపూర్ చనిపోయిందన్న వార్త తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా తాను బతికే ఉన్నానని, తను చనిపోయిందనేది అబద్ధమని పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది నటి వీణా కపూర్. తాను చనిపోయినట్లు పుకార్లు పుట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె కుమారుడు అభిషేక్ చడ్డాతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇద్దరి పేర్లు ఒక్కటే..
ఈ విషయంపై నటి వీణా కపూర్ మాట్లాడుతూ "నా కొడుకు నన్ను హత్య చేశాడన్నది పూర్తిగా అవాస్తవం. అసలు నిజమేమిటంటే నాపేరుతో ఉన్న మరో మహిళను హత్య చేశారు. ఇక్కడ ఇద్దరి పేర్లు ఒక్కటే అయినంతా మాత్రానా ఆ హత్యకు గురైంది నేనే అని అంటారా. నేను జుహులో కాదు, గుర్ గావ్ లో ఉంటున్నాను. నా కుమారుడితో కలిసి నివసిస్తున్నాను. నేను చనిపోలేదు. బతికే ఉన్నాను".

ఫోకస్ చేయలేకపోతున్నా..
"దయచేసి అసత్యపు ప్రచారాన్ని నమ్మకండి. ఇప్పటికే దీనిపై మేము ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వద్దులే అని ఫిర్యాదు ఇవ్వకుండా వదిలేస్తే రేపు ఇంకొకరికి కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పటికే వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో నాకు మెంటల్ టార్చర్ అవుతోంది. షూటింగ్ లో నా పనిపై ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు" అని నటి వీణా కపూర్ చెప్పుకొచ్చింది.
|
కలలో కూడా ఊహించలేదు..
"అమ్మను ఎందుకు చంపావని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. నేను తనను చంపలేదు, తను బతికే ఉంది. నేను నా తల్లిని కిరాతకంగా మర్డర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అది చూసి నేను అస్వస్థకు లోనయ్యాను. అసలు ఇలాంటిది నేను కలలో కూడా ఊహించలేదు. అమ్మంటే నాకు ఎంతో ఇష్టం. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలను ఆపేయండి" అని వీణా కపూర్ కుమారుడు అభిషేక్ చడ్డా కోరాడు.

ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో..
ముంబై నగరంలో గత వారం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి గొడవల కారణంగా వీణా కపూర్ (74) అనే మహిళను ఆమె కన్న కొడుకు అత్యంత పాశవికంగా హత్య చేశాడు. సచిన్ కపూర్ అనే వ్యక్తి తన కన్న తల్లిని బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి చంపాడు. తల్లి తలపై కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలోని రాయఘడ్ జిల్లాలోని ఓ నదిలో పారేశాడు.

సోషల్ మీడియాలో పోస్ట్ తో..
ముంబైలోని జుహు ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వీణా కపూర్ హత్య వార్త బయటకు రావడంతో అందరూ నటి వీణా కపూర్ అని అనుకున్నారు. హిందీ టీవీ సీరియల్స్ నటి, వీణా కపూర్ స్నేహితురాలు నీలు కోహ్లీ ఆమె చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆమె నిజంగానే హత్య చేయబడిందని అంతా నమ్మారు. అలాగే వీణా కపూర్ మర్డర్ న్యూస్ జాతీయా మీడియాలో కూడా ప్రధానంగా రావడంతో తెగ వైరల్ అయిపోయింది.