»   » నితిన్ హీరోయిన్...అప్పుడే టీవీ సీరియల్స్ లోకి

నితిన్ హీరోయిన్...అప్పుడే టీవీ సీరియల్స్ లోకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా పెద్ద తెరపై ఫేడవుట్ అయిన హీరోయిన్స్...చూపు బుల్లి తెరపై పడుతూంటుంది. అక్కడ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి రకరకాలగా పోగ్రామ్ లలో, సీరియల్స్ కనపిస్తూ అలరిస్తూంటారు. నటన అలవాటైన వారు కావటం, ఆల్రెడి ప్రేక్షకులకు పరిచయమున్నవారు కావటం, ఇప్పటికీ కొద్దో గొప్పో క్రేజ్ ఉండే ఉంటుందనే నమ్మకం నిర్మాత,దర్శకులుకు ఉండటంతో టీవిలో ఆఫర్స్ వస్తూంటాయి. అయితే ఈ మధ్యనే హార్ట్ ఎటాక్ తో పలకరించిన అదా శర్మ...టీవి కి షిఫ్ట్ అవుతోంది.

నితిన్‌ సరసన 'హార్ట్‌ ఎటాక్‌'లో హీరోయిన్‌గా నటించిన అదా తన అందచందాలు, నటనతో ఆకట్టుకొంది. విక్రమ్‌భట్‌ తీసిన '1920'తో వెండితెరపై కాలుపెట్టిన అదా శర్మ, దాని తర్వాత 'ఫిర్‌', 'హమ్‌ హై రాహీ కార్‌ కే', 'హసీ తో ఫసీ' వంటి చిత్రాల్లో నటించింది. కన్నడంలో 'ధీర రాణా విక్రమ'లోనూ హీరోయిన్ గా చేసింది.

Adah Sharma in Vipul Shah's Life OK show

'హార్ట్‌ ఎటాక్‌' తర్వాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తాయని చాలామంది భావించారు. కానీ ఇంతవరకు ఆమె మరే తెలుగు సినిమాకూ సంతకం చేసిన దాఖలా లేదు. పెద్ద సినిమాలు అయితేనే చేస్తానని ఆమె కూర్చుంది. కొందరు ఆమెను సెకండ్ హీరోయిన్ గా అడిగినా తిరస్కరించిందని తెలుస్తోంది. రెమ్యునేషన్ వద్ద పట్టువిడుపు లేకపోవటం కూడా తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవటానికి కారణమని చెప్తారు.

ఇప్పుడు హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ 'లైఫ్‌ ఓకే' కోసం బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు విపుల్‌ షా తీయబోతున్న సీరియల్‌లో హీరోయిన్ గా నటించేందుకు ఆమె అంగీకరించింది. ఎంటీవీ వీజేగా పాపులర్‌ అయిన రణ్‌విజయ్‌సింగ్‌ జోడీగా ఈ సీరియల్‌లో కనిపించనుంది అదా. ఓ పంజాబీ కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందే ఈ సీరియల్‌లో రణ్‌విజయ్‌ తండ్రిగా సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు రాజ్‌ బబ్బర్‌ నటించనుండటం విశేషం.

English summary
Adah Sharma, loved for her girl-next-door look has been roped in to play the female lead in this untitled concept for Life OK. Adah happens to be a find of ace film maker Vikram Bhatt; she made her debut on the big screen with the successful movie 1920. Seen in the character of Lisa Singh in the movie, Adah went on to be nominated for the Filmfare Award for Best Debut Female.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu