»   » రామ్ చరణ్ తర్వాత హాట్ సీట్ లో ధనుష్

రామ్ చరణ్ తర్వాత హాట్ సీట్ లో ధనుష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత నాగార్జున వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం కి క్రేజ్ ఎంత ఉందో మనకందరికీ తెలిసిందే. దాంతో ఈ కార్యక్రమం సినిమా ప్రమోషన్లకు, పబ్లిసిటీకి కొత్త అడ్డాగా మారింది. ‘ముకుంద' విడుదల సమయంలో వరుణ్ తేజ్, పూజా హెడ్గే.. ‘బీరువా' కోసం సందీప్ కిషన్.. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సినిమా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చూసుకున్నారు. తాజాగా తమిళ హీరో ధనుష్, నాగార్జున షోలో పాల్గొన్నారు. త్వరలో విడుదల కానున్న ‘అనేకుడు' సినిమా విశేషాలను నాగార్జునతో కలిసి ఈ కార్యక్రమంలో పంచుకున్నారు.

ఇక ఇప్పటికే రామ్ చరణ్ ఈ హాట్ సీట్ లో కూర్చున్నారు. ఫస్ట్ సీజన్ లో చిరంజీవి వస్తే సెకండ్ సీజన్ లో రామ్ చరణ్ వచ్చారు. అయితే రామ్ చరణ్ కు ప్రస్తుతం ఏ సినిమాలు రిలీజ్ కు లేవు ప్రమోట్ చేసుకోవటానికి. కానీ ధనుష్ మాత్రం తెలుగులో ఎలాగైనా సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. దాంతో ఆయన ఉత్సాహంగా ఈ పోగ్రాంలో ఎంటరయ్యారు.

After Ram Charan, Danush Sits In Hot Seat

‘రంగం' ఫేం కెవి ఆనంద్ దర్శకత్వంలో ధనుష్, అమైరా దస్తూర్ జంటగా నటించిన సినిమా ‘అనేకుడు'. హారిస్ జయరాజ్ స్వరపరిచిన ఈ సినిమా తెలుగు ఆడియో నేడు, ఫిబ్రవరి 10న హైదరాబాద్లో సినీ ప్రముఖుల నడుమ అత్యంత వైభవంగా విడుదల కానుంది. ఈ ఏడాది ‘రఘువరన్ బిటెక్', ‘పందెం కోళ్ళు' సినిమాల తర్వాత తెలుగులో ధనుష్ మార్కెట్ పెరిగింది. ‘అనేకుడు'తో హట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నాడు.

బుల్లితెర వీక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. సూపర్ సక్సెస్ అయిన మొదటి సీజన్ కి కొనసాగింపుగా కింగ్ నాగార్జున రెండవ సీజన్ మొదలుపెట్టారు. రెండవ సీజన్ కి కూడా అందరి చేత ఆదరాభిమానాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. నాగార్జున తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడులో అత్యంత ఆకర్షణీయమైన అంశం, తెలుగు సినీ ప్రముఖులు, హీరోయిన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంటర్ టైన్ చెయ్యడం.

సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రసారం అయ్యే ఈ ప్రోగ్రాంలో ప్రతి శుక్రవారావు ఓ సెలబ్రిటీ వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే రెండో సీజన్లో అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ తేజ్, పూజా హెడ్గే, రెజీన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మిల్క్ బ్యూటీ తమన్నాకి ఆ అవకాశం దక్కింది. తమన్నా ఇటీవలే మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ లో పాల్గొంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 13వ తేదీన ప్రసారం కానుంది. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Tamil Superstar Danush says that he should attend "Meelo Evaru Koteeswarudu" show in order to promote his latest movie 'Anekudu' (Anegan in Tamil) along with director KV Anand.
Please Wait while comments are loading...