అవినాష్ నిజస్వరూపం బయటపడింది: అసలు విషయం చెప్పి పరువు తీసేసిన అజయ్

By Manoj Kumar P

ముక్కు అవినాష్... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరిది. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా పరిచయమైన ఈ యంగ్ ఆర్టిస్టు.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, టీమ్ మెంబర్ స్థాయి నుంచి లీడర్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకీ ఎంట్రీ ఇచ్చాడు. షో ఆరంభంలో మంచి పేరు తెచ్చుకున్న జబర్ధస్త్ కమెడియన్.. ఈ మధ్య వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి సోదరుడు ఓ నిజం చెప్పి అవినాష్ పరువు తీసేశాడు. ఆ వివరాలు మీకోసం.!

అందులో స్పెషలిస్టు.. నవ్వు పంచే ఆర్టిస్టు

అందులో స్పెషలిస్టు.. నవ్వు పంచే ఆర్టిస్టు

మిమిక్రీ ఆర్టిస్టు స్థాయి నుంచి తెలుగు ప్రేక్షకులు గుర్తించే కమెడియన్‌గా ఎదిగాడు అవినాష్. దీనికి కారణం జబర్ధస్త్ అనే షో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు నటులను ఇమిటేట్ చేయడంతో పాటు లేడీ గెటప్‌లతో నవ్వును పంచే అతడు.. చాలా మందితో పోలిస్తే త్వరగా ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.

జోకర్ అని ఎంట్రీ.. వాళ్ల మనసు దోచాడు

జోకర్ అని ఎంట్రీ.. వాళ్ల మనసు దోచాడు

జబర్ధస్త్‌లో పేరున్న టీమ్ లీడర్‌గా దూకుడు ప్రదర్శిస్తున్న తరుణంలో, అవినాష్‌కు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో లైఫ్ ఇచ్చిన షోకు బ్రేకిచ్చి.. ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడుతోన్న సమయంలో తనను తాను జోకర్‌గా చెప్పుకుని ఆనందించాడు. అదే నిరూపిస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేసి మనసులు దోచుకున్నాడు.

ఆ గొడవ నుంచి మారిపోయిన అవినాష్

ఆ గొడవ నుంచి మారిపోయిన అవినాష్

అనారోగ్య కారణంతో బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయాడు నోయల్. అతడు ఎలిమినేట్ అయిన సమయంలో స్టేజ్‌పై నుంచి అవినాష్‌పై కొన్ని ఆరోపణలు చేశాడు. అప్పుడు సహనం కోల్పోయిన జబర్ధస్త్ కమెడియన్.. నోయల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అంతేకాదు, అప్పటి నుంచి తరచూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

జబర్ధస్త్ టీమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి

జబర్ధస్త్ టీమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవినాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంత మంది ఫ్యాన్స్ పెరిగారో... అతడి వ్యక్తిత్వాన్ని విమర్శించే వాళ్లూ అంతే మంది ఉన్నారు. దీనికి కారణం అతడు తరచూ జబర్ధస్త్ టీమ్‌పై ఆరోపణలు చేయడమే. అంతేకాదు, తనను ఆ షో నుంచి బయటకు పంపించేశారని సింపతీ గేమ్ ఆడుతుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి.

నిజం చెప్పి అతడి పరువు తీసేశాడుగా

ముక్కు అవినాష్ ఈ మధ్య జబర్ధస్త్ షోపై ఆరోపణలు చేయడం.. బిగ్ బాస్ తర్వాత అందులోకి రీఎంట్రీ ఇవ్వడం కుదరదని చెప్పడం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. అలాగే, దీనిపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇలాంటి సమయంలో అవినాష్ నిజస్వరూపం బయటపెట్టేశాడు అతడి సోదరుడు అజయ్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

అవినాష్ నిజస్వరూపం బయటపడింది

అవినాష్ నిజస్వరూపం బయటపడింది

‘జబర్దస్త్ వాళ్ల గెంటేశారు.. మళ్లీ షోలోకి రావద్దన్నారు' అని అవినాష్ అంటుంటే.. అతడి సోదరుడు అజయ్ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడాడు. తాజా ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ ‘వచ్చిన తర్వాత అన్న జబర్ధస్త్‌లోకే వెళ్తాడు. వాళ్ల పర్మీషన్ తీసుకునే బిగ్ బాస్‌లోకి వెళ్లాడు' అని చెప్పి షాకిచ్చాడు. దీనిని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవినాష్‌ను ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X