India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ajith's Valimai on OTT రిలీజ్‌కు ముందే వేల అడుగుల కటౌట్‌తో రికార్డు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

  |

  దేశవ్యాప్తంగా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లపై భారీ బడ్జెట్, ఫీల్ గుడ్ చిత్రాల ప్రభంజనం కొనసాగుతున్నది. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రం థియేటర్లలో అభిమానులను ఆకట్టుకొలేకపోయింది. అయితే ఇక ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేందుకు ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ కావడానికి సిద్దమైంది. అయితే వలిమై ఓటీటీ రిలీజ్‌కు ముందు అజిత్ ఫ్యాన్స్ సృష్టించిన హల్‌చల్ రికార్డు సృష్టించడం విశేషంగా మారింది. వలిమై రిలీజ్ డేట్, అభిమానుల హంగామాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ..

  ZEE5 Unveils 10,000 sq ft Poster Of ‘Valimai’ | Filmibeat Telugu
   ZEE5 వలీమై మూవీ స్ట్రీమింగ్

  ZEE5 వలీమై మూవీ స్ట్రీమింగ్

  దేశీయ ఓటీటీ రంగంలో ZEE5 ఫ్లాట్‌ఫామ్ తన సత్తాను చాటుతున్నది. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు ఎల్లప్పుడూ అద్భుతమైన చలన చిత్రాలను అందిస్తున్నది. 12 భాషల్లో 3,500 సినిమాలు, 500+ టీవీ షోలు, 4,000+ మ్యూజిక్ వీడియోలు, 35+ థియేటర్ ప్లేలు మరియు 90+ లైవ్ టీవీ ఛానెల్‌లతో, ZEE5 ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వీక్షకుల కోసం సాటిలేని కంటెంట్ అందిస్తుంది. తాజాగా అజిత్ కుమార్ నటించిన వలీమై చిత్రం ZEE5 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

  హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్

  హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్

  వలీమై సినిమా విషయానికి వస్తే.. 2022 ఆరంభంలో అజిత్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. టాలీవుడ్ యువ హీరో కార్తీకేయ గుమ్మకొండ విలన్‌గా తన ప్రతిభను చాటుకొన్నాడు. అజిత్ కుమార్ యాటిట్యూడ్, బైక్ రేసింగ్ ఎపిసోడ్ హాలీవుడ్ సినిమాను తలపించింది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించాయి.

   బాక్సాఫీస్ వద్ద 200కుపైగా కలెక్షన్లు

  బాక్సాఫీస్ వద్ద 200కుపైగా కలెక్షన్లు

  ఖాకీ మూవీ ఫేమ్ హెచ్ వినోద్ రచన, దర్శకత్వంలో వచ్చిన వలీమై చిత్రాన్ని జీ స్టూడియోస్‌‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా వసూళ్లను నిలవరించకపోయింది.

  10,000 అడుగుల అజిత్ పోస్టర్

  10,000 అడుగుల అజిత్ పోస్టర్


  ఇలాంటి పరిస్థితుల అనంతరం వలీమై చిత్రం మార్చి 25వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా జీ5 సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో ఏ ఓటీటీ సంస్థ కూడా ఇలాంటి పోస్టర్‌ను ఏర్పాటు చేయకపోవడం ఓ రికార్డుగా మారింది. ప్రస్తుతం వలీమై పోస్టర్‌ చెన్నైలో టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

  జీ5 ఏర్పాటు చేసిన పోస్టర్‌పై అభిమానులు ఫిదా

  జీ5 ఏర్పాటు చేసిన పోస్టర్‌పై అభిమానులు ఫిదా


  వలీమై సినిమాకు సంబంధించిన అతిపెద్ద పోస్టర్‌ను జీ5 సంస్థ ఏర్పాటు చేయడంతో అజిత్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అజిత్ క్రేజ్‌ను రెండింతలు పెంచే విధంగా ఉంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే సంతోషంగా ఉంది. అజిత్ ఫ్యాన్స్ సత్తా ఏమిటో ఈ పోస్టర్ తెలియజేసింది అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

  English summary
  Valimai movie premiere is coming up from March 25. To celebrate its post-theatrical streaming, ZEE5 has come out with a tribute event dedicated to Ajith Kumar's superstardom. Today, the streaming giant revealed the largest poster of the size of 10,000 sq ft for the film. The reveal event was organised by ZEE5 and was attended by the press and media and the ZEE Studio Team at YMCA in Chennai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X