అఖిల్: ఈ రోజే కొంచెం టచ్ లో ...(వీడియో)
హైదరాబాద్ :వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొంది రిలీజ్ కు దగ్గరవుతున్న చిత్రం అఖిల్. ఈ చిత్రం దీపావళి కానుకగా 11, నవంబర్ 15న విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ని పెంచారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా...జీ తెలుగులో..కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే పోగ్రామ్ కు హాజరయ్యారు.
ఈ పోగ్రామ్ లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు అడిగే ప్రశ్నలకు, సరదాగా సమాధానాలు చెప్పబోతున్నారు అఖిల్. మీరు ఈ పోగ్రామ్ ని ఈ రోజు రాత్రి తొమ్మిదిన్నరకు చూడవచ్చు.

ఈ చిత్రం సెన్సార్ పూరైంది. యూ/ఏ ధృవీకరణ పత్రం లభించినట్లు చిత్ర నిర్మాత నితిన్ తన అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా వెల్లడించారు. శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Click it and Unblock the Notifications











