For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రిషాతో డేటింగా? రానా ఒప్పుకోడు.. రాశీఖన్నా నా సిస్టర్.. నా గర్ల్ ఫ్రెండ్ పేరు.. అఖిల్

  By Rajababu
  |
  అమ్మో..త్రిషాతో డేటింగా? రానా ఒప్పుకోడు..!

  అక్కినేని నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన మరో హీరో అఖిల్. అక్కినేని కుటుంబ కథా చిత్రం మనంలో అతిథిగా కనిపించినా.. అఖిల్ సినిమా ఆయనకు తొలి చిత్రం. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తాజాగా హలో చిత్రం నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ నిర్వహించే గేమ్ షోలో కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. అఖిల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

   ఫ్రెండ్స్‌తో అఖిల్ గోవాకు

  ఫ్రెండ్స్‌తో అఖిల్ గోవాకు

  నా జీవితంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్లింది లేదు. 12వ తరగతి పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్‌తో గోవా వెళ్లాను. వెళ్లడానికి ముందు నాన్న, అమ్మ కొంత ఆందోళనకు గురయ్యారు. నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. గోవా నుంచి క్షేమంగా తిరిగి రావడంతో వారు చాలా సంతోషంగా పడ్డారు.

   సిసింద్రీ గురించి తెలియదు

  సిసింద్రీ గురించి తెలియదు

  సిసింద్రీ సినిమా చేసేటప్పుడు నా వయసు ఒక సంవత్సరం. అప్పుడు నాకు ఏమీ తెలియదు. అసలు షూటింగ్ విషయాలు నాకు ఏమి తెలియదు. అమ్మ, నాన్న, డైరెక్టర్ నా చేత నటింప జేయడానికి చాలా కష్టపడ్డారు. పెద్ద పెరిగిన తర్వాత ఆ సినిమా చూశాను.

   వెధవ ఎలా పుట్టావురా? టీచర్ ఫైర్

  వెధవ ఎలా పుట్టావురా? టీచర్ ఫైర్

  స్కూల్ డేస్‌లో సరోజ మేడమ్ ఉండేది. నా గురించి చాలా ఆందోళన పడేది. ఆమె మా తాత గారికి పెద్ద ఫ్యాన్. నాకు తెలుగు సరిగా రాకపోయేది. దాంతో ఆమె భోరున ఏడ్చేది. మీ తాత గారు ఎలా మాట్లాడుతారు. వెధవ.. ఎలా పుట్టవురా. ప్రతీ రెండు రోజులకు అమ్మకు ఫిర్యాదు చేసేది.

   సరోజ మేడమ్‌కు థ్యాంక్స్

  సరోజ మేడమ్‌కు థ్యాంక్స్

  సరోజ మేడమ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను తెలుగు బాగా రాయడానికి, చదవడానికి ఆమే కారణం. ఇప్పుడు నేను తెలుగు బాగా మాట్లాడానికి, సినిమాలో నా తెలుగు మంచి ఉండటానికి ఆమె కారణం.

   నాగ్, చైతూ గురించి తప్పుగా

  నాగ్, చైతూ గురించి తప్పుగా

  కొంచెం టచ్‌లో ఉంటే.. షోలో తన నాగ్, అమల, చైతూలకు సంబంధించిన కొన్ని అఖిల్‌కు వేశారు. అమల, నాగార్జున నటించిన తొలి చిత్రం ఏమిటి అని అడుగగా శివ అని అఖిల్ రాంగ్ అన్సర్ చెప్పారు. కానీ వారిద్దరు నటించిన చిత్రం కిరాయిదాదా. ఇక నాగచైతన్య ఎన్ని చిత్రాల్లో నటించాడు అని అడుగగా ఏడు అని చెప్పాడు.. నిజానికి నాగచైతన్య 10 చిత్రాల్లో నటించారు.

   అఖిల్ గురించి చైతూ సీక్రెట్స్

  అఖిల్ గురించి చైతూ సీక్రెట్స్

  అఖిల్ గురించి నాగచైతన్య కొన్ని సీక్రెట్స్ బయటపెట్టారు. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్తు ఓ సారి నాన్నకు దొరికాడు. దాంతో ఇంటివద్ద నాన్న సెక్యూరిటీ కట్టుదిట్టం చేశాడు. దాంతో అప్పుడప్పుడు 15 అడుగుల గోడ ఎక్కి దూకే వెళ్లిపోయేవాడిని అని అఖిల్ చెప్పాడు. అందుకోసం సెక్యూరిటీ సిబ్బందిని తప్పుదోవ పట్టించేవాడిని అని అన్నారు.

   అమీ జాక్సన్‌తో డేటింగ్

  అమీ జాక్సన్‌తో డేటింగ్

  ఈ షోలో భాగంగా ఓ గేమ్ ఆడారు. ఆటలో భాగంగా అమీ జాక్సన్‌తో డేటింగ్ చేయాల్సి వచ్చింది. సిస్టర్ రోల్‌లో ఎవరిని ఎంపిక చేసుకొంటారు అని అడుగగా రాశీఖన్నా అని సమాధానం చెప్పాడు. తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయాలని ఉంది అని చెప్పారు. తదుపరి సినిమా ఛాన్స్‌ను రకుల్‌కు ఇస్తాను అని అఖిల్ చెప్పాడు.

   ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్

  ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్

  యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించాలని ఉంది. అలాగే ఐదేళ్ల తర్వాత మహేశ్‌బాబుతో మల్టీస్టారర్ చేస్తాను. అల్లు అర్జున్‌ నిర్మాతగా మారే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాధారణంగా ఉండే స్థితిని, సిల్వర్ స్క్రీన్‌‌పై ఆయన క్రేజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

   గర్ల్‌ఫ్రెండ్ ఉంది

  గర్ల్‌ఫ్రెండ్ ఉంది

  నాకు గర్ల్‌ఫ్రెండ్ ఉంది అని ఓ ప్రశ్నకు అఖిల్ సమాధానం చెప్పారు. నాకు ఏ హీరోయిన్ కూడా డేటింగ్ అవకాశం ఇవ్వలేదు. డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలంటే.. హీరోయిన్‌లా ఉండకూడదు. ఫిల్మీ స్లయిల్‌లో ఉండకూడదు. హీరోయిన్ అయినా సినిమా ప్రభావం ఉండకూడదు.

  త్రిషాతో డేటింగా? రానా

  త్రిషాతో డేటింగా? రానా

  త్రిషాకు ఫోన్ చేసి డేటింగ్‌కు వెళ్తాం అని అడుగు అని యాంకర్ ప్రదీప్ సూచించగా, త్రిషాతో డేటింగా? నా వల్ల కాదు బాబోయ్.. రానా.. రానా.. అంటు నసిగాడు. త్రిషాతో డేటింగ్ అంటే కష్టం. రానా ఒప్పుకోడు అనే విధంగా అఖిల్ ముఖం పెట్టారు.

  English summary
  Akhil Akkineni is getting ready with Hallo movie. This movie is set to release on December 22nd. In this occassion, Akhil joined a Television game show recently. As part of the show, He said.. going on date with Trisha is impossible, because of Rana Daggubati.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X