twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ తర్వాత ‘అఖిల్’ రైట్సే తీసుకున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 20న విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ ఆడియో లాంచ్ రైట్స్ కోసం టీవీ ఛానెల్స్ మధ్య పోటీ ఏర్పడింది. ఫైనల్ గా టీవి 5 వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు బాహుబలి ఆడియో లాంచ్ రైట్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు అఖిల్ చిత్రం రైట్స్ తీసుకుంటున్నారు. ఇందుకోసం భారీ మొత్తం ఆ ఛానెల్ వారు వెచ్చించినట్లు సమాచారం.

    అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే. నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు.

    నాగార్జున పుట్టినరోజున హిందీ హీరో సల్మాన్‌ఖాన్‌ ట్విట్టర్‌ ద్వారా అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్' ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో అఖిల్‌ చేసిన సందడి అభిమానుల్ని అలరించింది. చిచ్చర పిడుగులా అఖిల్‌ తెరపై వేగాన్ని కనబరిచాడు. ఇప్పుడా టీజర్ రికార్డులు బ్రద్దలు కొడుతూ దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ టీజర్ 10 లక్షల వ్యూస్ సాధించింది. ఈ టీజర్ ని ఇక్కడ మరోసారి చూడవచ్చు.

    మరో ప్రక్క ఈ చిత్రానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మొదట వినపడే పేరు మణిశర్మ. ఆయన్ను ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంగీతం తమన్, అనూప్ రూబెన్స్ ఇస్తున్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మణి తోనే చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం స్పెయిలో ఈ చిత్రం కోసం ఓ సాంగ్ ని ప్లాన్ చేసారు. సెప్టెంబర్ 13 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యింది. హీరో,హీరోయిన్స్ పై ఈ పాట డిజైన్ చేసారు. సెప్టెంబర్ 20న ఆడియోని, సినిమాని అక్టోబర్ 22న విడుదల చేయటానికి ప్లాన్ చేసారు

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రస్తుతం ఆస్ట్రియా, స్పెయిన్‌లలో పాటల్ని చిత్రీకరిస్తున్నారు. రెండు పాటల చిత్రీకరణతో ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంది. ఇక సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా ఆడియోను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా సినిమా విడుదల కానుంది.

    ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు ..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు.

     Akhil debut film 'Akhil' :TV5 buys audio launch rights

    ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు, ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే ఇటీవల థాయ్ లాండ్ కు ప్రయాణం అయిన అఖిల్ త్వరలోనే వీడియో ఒకటి విడుదల చేస్తానంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. అఖిల్ ఇచ్చిన మాటను చిత్ర నిర్మాత నితిన్ నిలబెట్టుకుంటూ మేకింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    అధికారికంగా చిత్ర నిర్మాత నితిన్ విడుదల చేసిన వీడియోతో ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమైంది! స్పెయిన్ వీధుల్లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ లో అఖిల్... ఎంతో రిస్క్ తీసుకుని నటించాడు. అంతేకాదు... ఇటు యూనిట్ సభ్యులతో పాటు... అటు దర్శకుడు వీవీ వినాయక్ తోనూ సూపర్ అనిపించుకున్నాడు.

    యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

    శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

    English summary
    Audio of the Akil film will be launched on the 20th of this month. TV5 has bagged the audio launch exclusive telecast rights for a whopping amount.This is the second major event after Baahubali that TV5 has managed to bag among severe competition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X