బెడ్‌రూమ్‌లో ఒంటరిగా నా పరిస్థితి ఏంటన్న మోనాల్.. అఖిల్ షాకింగ్ కామెంట్!
2012లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుడిగాడు సినిమాతో గుజరాతి భామ మోనాల్ గజ్జర్ టాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వివిధ భాషలలో దాదాపు డజను సినిమాలు చేసినా సరే ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో ఈ భామ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎనలేని క్రేజ్ లభించింది. హౌస్ లోపల మరో కంటెస్టెంట్ అఖిల్ తో ప్రేమాయణం ఈ భామ క్రేజ్ ను రెండింతలు చేసిందని చెప్పవచ్చు. తాజాగా మోనాల్ ఒంటరిగా ఉన్నానని చెబుతూ నా పరిస్థితి ఏమిటని ఫోటో చెప్పగా దానికి అఖిల్ అస్కతికర్మగా కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

టాలీవుడ్ ఎంట్రీ
సుడిగాడు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గుజరాతి భామ ఆ తర్వాత తెలుగులో వెన్నెల వన్ అండ్ హాఫ్, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్ అఫ్ బొమ్మాలి, దేవదాసి లాంటి సినిమాల్లో నటించింది. మధ్యలో తమిళ, మలయాళ, గుజరాతి సినిమాల్లో కూడా నటించింది. కానీ ఎన్ని సినిమాల్లో నటించినా సరే ఆమెకు తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 ఎనలేని క్రేజ్ సంపాదించి పెట్టింది.

ఆయనతో అఫైర్
అయితే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా చేయకూడదు చేస్తే మంచి గుర్తింపు ఉన్న సినిమాలు చేయాలని భావిస్తున్న ఈ భామ మొన్నటి దాకా టెలివిజన్ లో ప్రసారం అయిన డాన్స్ ప్లస్ అనే ఒక షో కి జడ్జిగా వ్యవహరించింది. ఓంకార్ ఆధ్వర్యంలో సాగిన ఈ షోలో ఆమె యష్ మాస్టర్ తో జత కట్టినట్లుగా ప్రేక్షకులను భ్రమింపచేస్తూ టీఆర్పీ పెంచుకునే ప్రయత్నాలు చేశారు నిర్వాహకులు.
ప్రేమునట్టా లేనట్టా
బిగ్‌బాస్ సీజన్ 4లో ప్రేమ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ మోనాల్ గజ్జర్ ఎక్కువగా బయట కూడా కలుస్తూ అందరిలోనూ అనుమానాలు రేపుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం పైకి స్నేహితులు అని చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు పెళ్లి, ప్రేమ అనే పదాలు వాడుతూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకరిగురించి ఒకరు ఆసక్తికర కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు.
Recommended Video

దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు
తాజాగా బెడ్ రూమ్ పిక్ షేర్ చేసుకున్న ఈ భామ.. ''గుడ్ మార్నింగ్, కానీ ఇది నైట్ ఫోటో షూట్, ఏమని చెప్పాలి నా పరిస్థితి అంటూ కామెంట్ చేసింది ఈ భామ. దానికి వెంటనే అఖిల్ స్పందిస్తూ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అంటూ కామెంట్ చేయడమే కాక కళ్ళుమూసుకున్న మంకీ ఎమోజీ సింబల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. అన్నట్టు వీరిద్దరూ కలిసి గుజరాత్ అమ్మాయి తెలుగు అబ్బాయి పేరుతో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











