Just In
- 9 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 14 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
- 18 min ago
పెళ్లి విషయం దాచిపెట్టడంపై కౌంటర్.. అందరి ముందు రవి పరువుదీసిన సుమ
- 1 hr ago
పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ
Don't Miss!
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- News
హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ స్పందన- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు- త్వరలో కీలక భేటీ
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. శంషాబాద్‌లో ఘన స్వాగతం!!
- Automobiles
బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాప్ 5లోకి అరియానా ఎలా వచ్చింది? మళ్లీ అరియానాను టార్గెట్ చేసిన సోహెల్, అఖిల్!
బిగ్‌బాస్ తెలుగు 4 షో చివరి వారానికి చేరుకొన్నది. ముగింపు వారంలో కూడా ఇంటి సభ్యుల మధ్య టాస్కుల పేరుతో చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని బిగ్‌బాస్ కొనసాగించాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఇంటిలో టైటిల్ గెలిచే అర్హత లేదో అనే విషయాన్ని ప్రతీ ఇంటి సభ్యుడు చెప్పాలి.. అందుకు గల కారణాలను వివరించాలి అంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం, వాదనలు ఇలా ఉన్నాయి.

విజేతగా అర్హత లేని వ్యక్తి ఎవరు
బిగ్‌బాస్ ఇంటిలోని సభ్యుల్లో విజేతగా అర్హత లేని వ్యక్తి ఎవరనే విషయాన్ని కారణాలతో వివరించాలి అనే బిగ్‌బాస్ ప్రశ్నకు అభిజిత్ సమాధానం ఇచ్చాడు. హారిక దేత్తడి ఎంచుకొని.. నీవు ఈ టైటిల్‌కు అర్హురాలి కావొద్దని అని నేను అనుకొంటున్నాను అని అన్నాడు.

అరియానాకు టైటిల్ గెలిచే అర్హత లేదు
ఇక అఖిల్ తన వాదనను వినిపిస్తూ.. అరియానాకు టైటిల్ గెలిచే అర్హత లేదని చెప్పాడు. అందుకు సరైన కారణాలను వివరిస్తూ.. కొన్ని టాస్కులలో అరియానా తన పరిమితిని, పరిధిని దాటింది అంటూ అఖిల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అరియానాను టార్గెట్ చేసిన హారిక దేత్తడి
అలాగే దేత్తడి హారిక కూడా తన వాదనను వినిపించింది. ఇంటిలో టైటిల్ గెలిచే అర్హత అరియానా గ్లోరికి లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టాస్కుల్లో తన పరిధిని మించి పోయింది. అది కూడా ఎక్కువ కాదు. కేవలం 5 శాతం మాత్రమే. అందుకే అరియానాకు టైటిల్ గెలిచే అర్హతలేదని భావిస్తున్నాను బిగ్‌బాస్ అంటూ హారిక తెలిపింది.

టాప్ 5లోకి అరియానా ఎలా వచ్చిందనే..
ఆ తర్వాత సయ్యద్ సోహెల్ కూడా ఇంటి సభ్యుల్లో టైటిల్ గెలిచే అర్హత లేని వ్యక్తిగా అరియానా గ్లోరిని ఎంచుకొన్నారు. అందుకు కారణాన్ని చెబుతూ.. టాస్కుల సమయంలో తన పరిధిని దాటి వ్యవహరించింది. అయితే అలా చేస్తే టాప్ 5లో ఎలా వచ్చింది అనే ప్రశ్నను కూడా వేసుకొన్నాను. అన్ని విషయాలు ఆలోచించుకొన్న తర్వాత నేను అరియానాకు టైటిల్ గెలిచే అర్హత లేదనే విషయాన్ని వెల్లడిస్తున్నాను అని సోహెల్ తెలిపారు.

ఘాటుగా స్పందించిన అరియానా
ఇంటి సభ్యులందరూ తనను టార్గెట్ చేయడంపై అరియానా గ్లోరి ఘాటుగా స్పందించింది. మీ అందరి వాదనలు విన్న తర్వాత నేను ఇంటిలో స్ట్రాంగ్ ప్లేయర్‌ను. టాప్ 5లోకి వెళ్లిందంటే.. నేను గేమర్ అనేది స్పష్టమైంది. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ అరియానా గ్లోరి పేర్కొన్నది.