twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన బన్నీ.. నెంబర్ వన్ మూవీగా అల వైకుంఠపురములో..

    |

    ఒకప్పుడు సినీమా థియేటర్స్ లో ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే రికార్డులపై ఎక్కువగా చర్చలు నడిచేవి. కానీ ఈ రోజుల్లో సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఒక పోటీ కనిపిస్తోంది. ఇక అభిమానులు సోషల్ మీడియాలో ఆ రికార్డులకు మరింత క్రేజ్ తెస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ సినిమా కూడా బుల్లితెరపై సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

    Recommended Video

    Ala Vaikunthapurramuloo కి అత్యధిక TRP కట్టబెట్టిన ఫ్యామిలీ ఆడియన్స్ || Oneindia Telugu
    బన్నీ కెరీర్ లోనే కాకుండా..

    బన్నీ కెరీర్ లోనే కాకుండా..

    ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బన్నీ కెరీర్ లోనే కాకుండా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి మొత్తంగా 200కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఇక బుల్లితెరపై కూడా ఈ సినిమా అదే స్థాయిలో రేటింగ్స్ అందుకోవడంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

    TRPతో సరికొత్త రికార్డ్

    TRPతో సరికొత్త రికార్డ్

    ఇటీవల జెమిని టీవీలో మొదటి సారి టెలికాస్ట్ అయిన అల వైకుంఠపురములో సినిమా 29.4 TRPతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ స్థాయిలో రేటింగ్స్ అందుకోలేదు. టాప్ 5లో ప్రభాస్, మహేష్ సినిమాల రికార్డులను కూడా వెనక్కి నెట్టి అల.. టాప్ 1లో నిలిచింది.

    బాహుబలి రికార్డ్ బ్రేక్..

    బాహుబలి రికార్డ్ బ్రేక్..

    ఇప్పటివరకు టాప్ రేటింగ్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేస్తే.. అల వైకుంఠపురములో 29.4 టాప్ లో ఉండగా ఆ తరువాత సరిలేరు నీకెవ్వరు 23.4 రేటింగ్ తో రెండవ స్థానంలో ఉంది. ఇక అప్పట్లో బాహుబలి సెకండ్ పార్ట్ 22.70 TRPని అందుకోగా ఆ తరువాత బాహుబలి మొదటి భాగం 21.84 రేటింగ్ అందుకుంది. ఇక 5వ స్థానంలో శ్రీమంతుడు 21.54తో కొనసాగుతోంది.

    ఏ మాత్రం తగ్గకుండా..

    ఏ మాత్రం తగ్గకుండా..

    ఈ విధంగా టాప్ 5 టెలివిజన్ రేటింగ్స్ లలో బన్నీ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతం కూడా చాలానే ఉపయోగపడింది. ఇక సినిమా విడుదల తరువాత బన్నీ స్టైల్ తో పాటు త్రివిక్రమ్ మేకింగ్ కూడా సరికొత్త ఫీల్ ని కలిగించడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకు ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యారు. ఇక బుల్లితెరపై కూడా అలా.. ఏ మాత్రం తగ్గకుండా TRP తో ఒక ట్రెండ్ సెట్ చేసింది.

    English summary
    One of Tollywood's top industry hits is the film ala vaikunthapurramuloo, Everyone who worked for the movie got a good craze. Director Trivikram and stylish star Allu Arjun are also getting a hat-trick and have entered the box office track. Including music director thaman,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X