స్టేజ్ మీద బ్రహ్మాజీ స్టెప్పులు.. గాలి తీసేసిన అలీ.. మరీ ఇంత దారుణమా?

తెరపై బ్రహ్మాజీ ఎంత యాక్టివ్‌గా, సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే బయట మాత్రం అంతకు మించి అనేలా ఉంటాడు. కౌంటర్లు, సెటైర్లు వేయడంలో బ్రహ్మాజీ స్టైల్ వేరు. సోషల్ మీడియాలో బ్రహ్మాజీ చేసే ట్వీట్లు, వేసే సెటైర్లు ఒక్కోసారి వివాదాస్పదానికి దారి తీస్తుంటారు. ఆ మధ్య కొన్ని రోజులు ట్వీట్టర్‌లోంచి బయటకు కూడా వెళ్లిపోయాడు. ఇక బ్రహ్మాజీ బుల్లితెరపై ఏదైనా షోలో కనిపిస్తే చేసే రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది.

సుమతో మామూలుగా ఉండదు..

సుమతో మామూలుగా ఉండదు..

బ్రహ్మాజీ సుమ కాంబో అంటే ఇక ప్రేక్షకులకు పండుగే. ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు అందరినీ నవ్విస్తుంటారు. వయసు గురించి కామెంట్ చేస్తూ బ్రహ్మాజీపై కౌంటర్లు వేస్తుంటుంది సుమ. ఈ ఇద్దరికి తోడుగా అలీ వచ్చాడంటే ఇక అక్కడంతా రచ్చ రచ్చే.

సుమ కొత్త షోలో..

సుమ కొత్త షోలో..

సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో ఈ వారం గెస్టులుగా అలీ, బ్రహ్మాజీ వచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమోను బయటకు వదిలారు. ఇందులో అందరూ కలిసి బ్రహ్మాజిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మొత్తంగా సుమ, అలీ కలిసి పరువుదీసేశారు.

Recommended Video

S5 (No Exit ) Movie Trailer Launch | Anchor Pradeep Speech
ముందుకు వద్దామనే..

ముందుకు వద్దామనే..

షోలోకి ఎంట్రీ ఇస్తున్న అలీ.. వస్తూనే సుమపై పంచ్ వేశాడు. ముందుకు రండి అలీ అంటూ సుమ అనడం.. ముందుకు రావడానికే ఇండస్ట్రీలోకి వచ్చిందంటూ అలీ రివర్స్ కౌంటర్ వేశాడు. ఇక లాక్డౌన్ పరిస్థితుల గురించి చెబుతూ.. ఇంట్లో ప్రతీ రోజూ ఓ చాలెంజ్‌లానే గడిచిందంటూ సెటైర్ వేశాడు.

బ్రహ్మాజీపై కౌంటర్..

బ్రహ్మాజీపై కౌంటర్..

బ్రహ్మాజి తనకు వచ్చిన సింపుల్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. దానిపైనా సుమ కౌంటర్ వేసింది. ఎవరైనా డ్యాన్స్ చేస్తూ ఉంటే కాలో చెయ్యే షేక్ అవుతుంది.. కానీ బ్రహ్మాజికి వయసు వల్ల మొత్తం షేక్ అవుతోందంటూ పరువుదీసేసింది.

 స్టేజ్ మీద డ్యాన్స్..

స్టేజ్ మీద డ్యాన్స్..


బ్రహ్మాజీ స్టేజ్ మీద డ్యాన్స్ చేసేందుకు వచ్చాడు. అంతకు ముందు అలీ జోరుగా స్టెప్పులు వేశాడు.అయితే బ్రహ్మాజీ వంతు వచ్చేసరికి మాత్రం అలీ ఆడుకున్నాడు. వీణ స్టెప్ వేసేందుకు రెడీ అవుతున్న బ్రహ్మాజి పరువు తీసేశాడు అలీ. వీణ స్టెప్ వేసేందుకు రెడీ అవుతుండగా.. మైకులోంచి శబ్దాలు చేయడంతో అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి అలీ మాత్రం బ్రహ్మాజీని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X