»   »  'ఆలీ 369' ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

'ఆలీ 369' ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ali's Game Show Ali 369 going to be Closed
హైదరాబాద్ : వెండితెరపై తన కామెడీ తో అదరకొట్టే అలీ...చిన్న తెరపైనా 'ఆలీ 369' అంటూ గత కొంతకాలంగా అలరిస్తూ వస్తున్నారు. 2011 లో ప్రారంభమైన ఈ గేమ్ ఎక్కడా ఓ వారం కూడా ఆగకుండా కంటిన్యూగా నవ్విస్తూ ముందుకు సాగుతోంది. అయితే ఈ షో కి మంగళం పాడేస్తున్నారు.

ఈ విషయమై అలీ మాట్లాడుతూ... " ఈ షో ఓ అద్బుతమైన ప్రయాణంలా సాగింది. మొదటగా కేవలం 13 ఎపిసోడ్స్ చేద్దామనుకున్నాం...తర్వాత 26 ఎపిసోడ్స్ గా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో...కంటిన్యూగా 143 ఎపిసోడ్స్ చేసేసాం. నేను ఈ పోగ్రాం ని పూర్తిగా నా టీమ్ సపోర్ట్ తో మాత్రమే చేయగలిగాను. నా టీమ్ లేకపోతే ఇది సాధ్యమయ్యే కాదు. ఇప్పుడు ఈ పోగ్రాంకి ఆపు చేయటమో లేక కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వటమో చేయదలుచుకున్నాం," అన్నారు.

షో విషయానికి వస్తే... సినిమా, టి.వి. రంగానికి చెందిన పలువురు ప్రము ఖులు ఈ గేమ్‌ షోలో పాల్గొంటూ వస్తున్నారు. విజేత గెలిచిన దానికి తొమ్మిదింతలు బహుమతిగా వస్తుంది. స్వతహాగా ఆలీ సినీనటుడు, హాస్యనటుడు కావడంతో ఈ కార్యక్రమం సరదాగానే సాగు తోంది. అంతేకాక ఎంతోమంది సినీ, టి.వి.రంగంలోని నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మంచి సరదా కార్య క్రమంగా ఇన్నాళ్లూ సాగుతోంది. ఆలీ యాంకర్‌గా మంచి మార్కులు సంపాదించారు. అలాగే పాల్గొన్న అభ్యర్ధులతో ఆలీ సరదా సరదా సంభాషణలు కూడా ప్రేక్షకులకు ఆనందాన్నిస్తాయి. ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిముషాలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం టి.వి. ఛానల్స్‌లో వస్తున్న కార్య క్రమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్య క్రమంగా మంచి మార్కులు సంపాదిం చుకుందని చెప్పొచ్చు.

English summary

 Ali 369, a popular game show hosted by comedian Ali, has finally come to an end. The show began in 2011 and now, Ali has reportedly decided to move on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu