For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్దస్త్‌లో నాగబాబును రీప్లేస్ చేసేది వీరే.. జబర్దస్త్‌కు కాలం చెల్లినట్టే.. వేరే కుంపటి

  |

  తెలుగు నాట జబర్దస్త్ షో అంటే తెలియని వారు, చూడని వారంటూ ఎవ్వరూ ఉండరు. విమర్శించడానికైనా సరే జబర్దస్త్‌ను చూసిన వారుంటారు. అయితే జబర్దస్త్ అంటే మొదటగా గుర్తొచ్చేది మెగా బ్రదర్ నాగబాబు. నవ్వుల నవాబు, టవర్ స్టార్ లాంటి బిరుదులతో జబర్దస్త్‌కే వన్నె తెచ్చాడు. తన నవ్వులతో, జడ్జిమెంట్‌తో ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈ కామెడీ షోకు ఆయన ప్రత్యేక ఆకర్షణేగా మారిపోయారు.

   ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వేదిక..

  ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వేదిక..

  నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర.. ఇలా టీమ్‌లు, ఆర్టిస్టులు జబర్దస్త్‌తో పేరు, ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. యాంకర్ అనసూయ కూడా ఈ షో ద్వారానే హైలైట్ అయింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని రష్మీకి కూడా ఓ బ్రాండ్ వ్యాల్యూను తీసుకొచ్చింది ఈ వేదికే. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపిన జబర్దస్త్ కనుమరుగువుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  ఓ చానెల్‌లో వచ్చిన ప్రోమోతో

  ఓ చానెల్‌లో వచ్చిన ప్రోమోతో

  జబర్దస్త్‌కు పోటీగా ఓ ఛానల్‌లో లోకల్ గ్యాంగ్స్ పేరుతో కామెడీ షో రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆ ఛానల్ ప్రోమో కూడా రిలీజ్ చేసేసింది. అందులో జడ్జిగా నాగబాబు, యాంకర్‌గా అనసూయ కనిపించారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర కూడా ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. జబర్దస్త్ టీమ్‌ల దాదాపుగా లోకల్ గ్యాంగ్స్‌కు మారిపోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

  అదే కారణమా..?

  అదే కారణమా..?

  నిజానికి.. జబర్దస్త్ షో నుంచి దర్శకులు నితిన్, భరత్ వెళ్లిపోయిన తర్వాత నాగబాబు మొత్తం తానేయై చూసుకుంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా రెమ్యునరేషన్ వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై జబర్దస్త్ స్కిట్స్‌లో టీం లీడర్స్ పంచ్‌లు వేసిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ల విషయంలోనే విబేధాలు వచ్చాయని, రెమ్యూనరేషన్ కూడా మరో కారణమై ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

  నాగబాబు ప్లేస్‌లో వచ్చేది వీళ్లే..

  నాగబాబు ప్లేస్‌లో వచ్చేది వీళ్లే..

  గురువారం వచ్చే జబర్దస్త్‌కు సాయి కుమార్‌ను, శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌కు ఆలీని అనుకుంటున్నట్లు టాక్. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారని తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారని వినికిడి. సాయి కుమార్ , ఆలీ ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ గనక జడ్జి స్థానంలో వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నాగబాబు నవ్వులు లేని జబర్దస్త్‌ను ఊహించుకోవడం కష్టమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

  #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
  జబర్దస్త్ కళ తప్పేనా..?

  జబర్దస్త్ కళ తప్పేనా..?

  జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ టీమ్‌లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న వీళ్లంతా వెళ్లిపోతే, ఆ షో పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఏడేళ్లు పూర్తి చేసుకోనున్న ఈ కామెడీ షో నుంచి మెయిన్ రోల్స్ తప్పుకోవడం వల్ల షో కళ తప్పుతుందా? లేక మునుపటి జోష్‌లోనే ఉంటుందా? అన్నది ప్రశ్నగా మిగిలింది. మల్లెమాల నుంచి వచ్చిన జబర్దస్త్‌కు పోటీగా ఎన్నో కామెడీ షోలు ఇతర ఛానళ్లలో వచ్చినా దానిముందు నిలవలేకపోయాయి. మరి ప్రస్తుతమున్న మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జబర్దస్త్ మనుగడపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాగ బాబు అండతో టీమ్ లీడర్స్ సైతం వేరే కుంపటి పెట్టేశారు. ఇలా జబర్దస్త్ హిట్ అవ్వడానికి కారణమైన వారంతా వెళ్లిపోతే.. మళ్లీ నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

  English summary
  Rumors That Naga Babu Quits Jabardasth Show. Ali, Sai Kumar And Bandla Ganesh Will Replace Naga Babu In Jabardasth. Some Team Leaers ALso Leaves Jabardasth ANd Starts Local Gangs Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X