For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. బాహుబలిని దాటిన పుష్ప.. ఇందులో చిరు మూవీనే టాప్

  |

  గతంలో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. దీంతో మన ఇండస్ట్రీ నుంచి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని స్టార్లంతా పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇలా గత ఏడాది తన స్టామినాను ఇండియా వ్యాప్తంగా చూపించుకున్న హీరో అల్లు అర్జున్. అతడు నటించిన 'పుష్ప' ఐదు భాషల్లో విడుదలైంది. దీనికి అన్ని చోట్లా భారీ స్థాయిలో స్పంనద దక్కింది. దీంతో కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఫలితంగా ఇది విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప మూవీతో బన్నీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన విశేషాలు మీకోసం!

  పుష్పగా అల్లు అర్జున్ అరాచకం

  పుష్పగా అల్లు అర్జున్ అరాచకం

  'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

  హాట్ సెల్ఫీతో షాకిచ్చిన రాశీ ఖన్నా: మేకప్ రూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోజులు

  అన్ని భాషల్లో హిట్.. హిందిలోనే

  అన్ని భాషల్లో హిట్.. హిందిలోనే

  మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గంథపు చెక్కల నేపథ్యంతో వచ్చిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చింది. ఇలా దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి భారీ విజయం దక్కింది. అలాగే, హిందీలోనూ వంద కోట్లు సాధించి పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది.

  పుష్ప మూవీ కలెక్షన్లు... లాభాలు

  పుష్ప మూవీ కలెక్షన్లు... లాభాలు

  క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్ల లాభాలు కూడా సొంతం అయ్యాయి.

  నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!

  ఓటీటీలోనూ సత్తా.. ట్రెండింగ్‌లో

  ఓటీటీలోనూ సత్తా.. ట్రెండింగ్‌లో

  ఐకాన్ స్టార్ నటించిన 'పుష్ప' మూవీ విడుదలై నెల రోజులు కూడా కాకముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. అందులోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ మూవీ చాలా రోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. అదే సమయంలో రికార్డులూ నమోదయ్యాయి. అన్ని భాషల్లోనూ ఓటీటీలోకి వచ్చేసినా థియేటర్లలో కూడా స్పందన దక్కింది.

  బుల్లితెరపై సత్తా చాటిన మూవీ

  బుల్లితెరపై సత్తా చాటిన మూవీ


  అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన 'పుష్ప' మూవీకి అటు థియేటర్లలోనూ.. ఇటు ఓటీటీలోనూ ఊహించని దాని కంటే ఎక్కువ స్పందనే వచ్చింది. అలాగే, బుల్లితెరపైనా ఇది సత్తా చాటుకుంది. మార్చి 13 వ తేదీన స్టార్ మా లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా మొదటిసారి 22.50 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. తద్వారా ఐదో స్థానానికి చేరుకుంది.

  Kajal Aggarwal: తల్లైన వెంటనే అలాంటి ఫొటో వదిలిన కాజల్.. డెలివరీ టైమ్‌లో ప్రమాదాన్ని వివరిస్తూ!

  పుష్ప ఖాతాలో మరో గొప్ప రికార్డ్

  పుష్ప ఖాతాలో మరో గొప్ప రికార్డ్

  'పుష్ప' మూవీ దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో కూడా ఇది సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ ఆ రాష్ట్రంలో బుల్లితెరపై ప్రసారం అయింది. దీనికి అక్కడ 10.69 రేటింగ్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరిపోయింది.

  టాలీవుడ్‌లో నాలుగో స్థానానికి

  టాలీవుడ్‌లో నాలుగో స్థానానికి

  తెలుగు సినీ ఇండస్ట్రీలో రూపొంది తమిళంలోకి డబ్ అయిన చిత్రాల్లో ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను సాధించిన రికార్డు చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' పేరిట ఉంది. అది అక్కడ 15.44 రేటింగ్‌ సాధించింది. ఆ తర్వాత 'నేనొక్కడినే' (13.06 రేటింగ్), 'అల.. వైకుంఠపురములో' (11.81 రేటింగ్) మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. పుష్ప నాలుగో స్థానానికి చేరింది.

  English summary
  Allu Arjun Did Pushpa Under Creative Director Sukumar Direction. Now This Movie Pushpa Tamil Version Gets 10.69 TRP Rating.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X