బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి TRPతో షాక్ ఇచ్చాడుగా.. విశ్వక్ సేన్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా..
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంత ముఖ్యమో ఈ రోజుల్లో టెలివిజన్ ప్రీమియర్స్ రేటింగ్స్ కూడా అంతే ముఖ్యంగా మారాయి. ఫ్యాన్స్ ఈ రెండు విషయాల్లో అస్సలు తగ్గడం లేదు. స్టార్ హీరోల సినిమాల TRP లు కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లుడు అదుర్స్ , ఫలక్ నుమా దాస్ ఎవరు ఊహించని విధంగా రేటింగ్స్ అందుకున్నాయి.

అల్లుడు అదుర్స్.. బుల్లితెరపై పాజిటివ్ రిజల్ట్
బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమాతో మొత్తానికి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన అనంతరం ఎలాగైనా అదే తరహాలో మరొక హిట్ కొట్టాలని అనుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అల్లుడు అదుర్స్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో థియేటర్స్ లోకి వచ్చింది. ఇక ఇటీవల టెలివిజన్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైనా కూడా
సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైనా కూడా టెలివిజన్ ప్రీమియర్స్ కు ఏకంగా 6.92 రావడం గ్రేట్ అనే చెప్పాలి. బెల్లంకొండ హిందీ డబ్ సినిమాలకు కూడా హిందీ ఛానెల్స్ లో మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక యూ ట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూవ్స్ వస్తుండడంతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైన విషయం తెలిసిందే.

ఫలక్ నుమా దాస్.. తక్కువ రేటింగ్స్ తో..
ఇక మరొక సినిమా ఫలక్ నుమా దాస్ కూడా మొదటిసారి టెలివిజన్ ప్రీమియర్స్ తో సందడి చేయగా ఆ సినిమా చాలా తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది. ఆ సినిమాను విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఇక రీసెంట్ గా మొదటిసారి టీవీలో రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 3.71TRP మాత్రమే వచ్చింది.
Recommended Video

మాస్ రాజా హ్యాట్రిక్ TRP
ఇక మాస్ రాజా రవితేజ ఇప్పటికే రెండుసార్లు TRPతో వండర్స్ క్రియేట్ చేసింది. మొదటిసారి 11.71 రాగా రెండవసారి 7.52టీఆర్పీతో షాక్ ఇచ్చింది. ఇక మూడవసారి 7.92 అందుకోవడం విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే మరొక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











