»   » ఆశ్చర్యం గొలిపే వార్త : రియాలిటీ షో కి షిప్టైన రామ్ చరణ్ హీరోయిన్

ఆశ్చర్యం గొలిపే వార్త : రియాలిటీ షో కి షిప్టైన రామ్ చరణ్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రామ్ చరణ్ సరసన నాయక్ చిత్రంలో హీరోయిన్ గా చేసిన అమలా పాల్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె ఆ మధ్య తమిళ దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అమలా పాల్ సినిమాలు ఏమీ కమిట్ కాలేదు. అయితే ఇప్పుడు ఆమె ఓ తమిళ టీవి ఛానెల్ కు రియాలిటీ షో చేయటానికి కమిటైందని సమాచారం. "అప్ స్టార్టర్స్ "పేరుతో ప్రసారం కానున్న రియాలిటీ షో కు జడ్జిగా చేయనుంది. ఆమెతో పాటు నటుడు శివ కూడా జడ్జిగా పాల్గొంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక అమాలా పాల్ కెరీర్ విషయానకి వస్తే...

రామ్‌చ‌ర‌ణ్, అల్లు అర్జున్‌ ల వంటి మెగా హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం అందుకోగానే... ఇక అమ‌లాపాల్ తారా స్దాయికి వెళ్లిపోతుంద‌న్నారంతా. తెలుగులో ఇక స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ హ‌ల్‌చ‌ల్ చేయ‌బోతోంద‌ని ఊహించారు. కానీ... అంద‌రూ అనుకొన్న‌ట్టుగా ఏమీ జ‌ర‌గ‌లేదు. `నాయ‌క్‌` హిట్టైనా... ఆమెకు ఒరిగిందేమీ లేదు. ఆ క్రెడిట్ మొత్తం రామ్‌చ‌ర‌ణ్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేసిన `ఇద్దర‌మ్మాయిల‌తో` ఆడ‌లేదు. దీంతో అమ‌లాపాల్‌ని అవ‌కాశాలు వ‌రించ‌లేదు. వేరే దారిలేక త‌మిళంవైపు దృష్టిపెట్టింది. మధ్యలో సముద్రఖ‌ని పుణ్యాన తెలుగులో నాని స‌ర‌స‌న `జెండాపై క‌పిరాజు`చిత్రంలో మాత్రమే న‌టించింది.

Amala Paul debuts on Television

ఆ చిత్రం విజ‌యం సాధిస్తే మ‌ళ్లీ అమలాపాల్‌కి తెలుగులో అవ‌కాశాలు అందేవి. కానీ దురదృష్టవశాత్తు ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆమె మాత్రం తొంద‌ర‌ప‌డి ఒక మెట్టు దిగి హ‌వీష్ స‌ర‌స‌న న‌టించడానికి ఒప్పుకొంది. కానీ అదీ వదులుకుంది.

మరో ప్రక్క ఆమలాపాల్ తల్లిపాత్రలోకి మారిపోతోందని వార్తలు వచ్చాయి. పాండిరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య రూపొందిస్తున్న ఓ బాలల చిత్రంలో ఆమె తల్లిగా నటిస్తోంది. అనుబంధం, ఆప్యాయతలు, భావోద్వేగాల సంగమంగా రూపొందే ఈ చిత్రంలో మూడు జంటలు, వారి పిల్లలు ప్రధాన తారాగణంగా కనిపిస్తారు.

ఒక జంటగా సూర్య-ఆమలాపాల్ నటిస్తున్నారు. తల్లిగా నటిస్తే ఏం? హీరో సూర్యనే కదా! కాబట్టి గ్లామర్‌కి ఏం ఢోకాలేదని, పెళ్లయ్యాక మంచి చిత్రాలనే ఆచి తూచి ఎంచుకుంటున్నానని, తన భర్త చెప్పినట్లుగా హీరోయిన్ ఓరియంటెడ్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్నానని అంటోంది. మొత్తానికి తెలివిగలదే.. తల్లిగా నటిస్తున్నా పక్కన ఎవర్‌గ్రీన్ హీరో సూర్య ఉన్నందుకే కాల్షీట్లు ఇచ్చానంటోంది ఈ అమ్మడు.

English summary
On a Tamil entertainment channel, there is this new TV reality show coming up “UP Starters”. This reality show will have Amala Paul as a judge where she and actor Shiva will be acting as judges. For the first time, Amala is making her TV debut and she will be continuing for a long, says the producer of the show.
Please Wait while comments are loading...