For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Amitabh Bachchan's KBC 13: కంటెస్టెంట్‌ ముందు 5000000 ప్రశ్న? అమితాబ్ వేసిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా?

  |

  కోవిడ్ కారణంగా వెండితెర వెలవెలబోతుంటే.. బుల్లితెర మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. టెలివిజన్ రంగానికి, ఓటీటీ రంగానికి మంచి రోజులు వచ్చాయనే వాదన మొదలైంది. థియేటర్లు మూసివేతతో వినోదం కరువైన ప్రేక్షకులకు టెలివిజన్ రంగం వినోదంతోపాటు నాలెడ్జిని పంచుతున్నది. తాజా బుల్లితెరపై రియాలిటీ షోల జోరు పెరిగింది. అందులో ఒకటి కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) కార్యక్రమం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నిర్వహిస్తున్న కేబీసీ 13 సీజన్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఆటతోపాటు భావోద్వేగంగా సాగిన తాజా ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..

  అసోంకు చెందిన టీజర్ హాట్ సీట్‌పై

  అసోంకు చెందిన టీజర్ హాట్ సీట్‌పై

  సోమవారం రోజు నాటి గేమ్‌లో అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన టీచర్ తుషార్ భరద్వాజ్‌ హాట్ సీట్‌పైకి వచ్చారు. ఆ రోజు ఎలాంటి లైఫ్ లైన్ ఉపయోగించుకోకుండా 40000 రూపాయలు గెలచుకొని రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. మంగళవారం ఆటను కొనసాగిస్తూ ప్రేక్షకులను, అమితాబ్‌ను ఆకట్టుకొన్నాడు.

  నర్స్‌తో కంటెస్టెంట్ ప్రేమకథ అలా..

  నర్స్‌తో కంటెస్టెంట్ ప్రేమకథ అలా..

  కేబీసీ గేమ్ మధ్యలో తుషార్ భరద్వాజ్ భార్య జానెట్‌ను వారి ప్రేమ కథ గురించి అడిగారు. దాంతో జానెట్ తన ప్రేమకథను వెల్లడిస్తూ.. నేను నర్స్‌గా పనిచేస్తున్నాను. ఆ సమయంలో గాయపడిన తన స్నేహితుడిని తీసుకొచ్చిన తుషార్‌ను తొలిసారి కలుసుకొన్నాను. తన స్నేహితుడు కోలుకొన్న తర్వాత డిశ్చార్జి చేశాం. కానీ పదే పదే తుషార్ హాస్పిటల్‌కు వచ్చేవాడు. ఓసారి ఎందుకు వస్తున్నావు అంటే.. మరుసటి రోజు వేడి నీళ్లలో చేతిని ముంచి గాయం చేసుకొన్నాడు. కేవలం నన్ను చూడటానికే అలాంటి పనిచేశాడని తెలిసింది. ఆ తర్వాత నేను ప్రేమికుల్లా మారిపోయాం అని జానెట్ చెప్పారు. ఆ తర్వాత బిగ్‌బీ కోరిక మేరకు జానెట్ సోనా రే సోనా పాటను పాడి వినిపించారు.

  అమితాబ్‌ను దండించిన హాస్టల్ వార్డెన్

  అమితాబ్‌ను దండించిన హాస్టల్ వార్డెన్

  అయితే గేమ్ కొనసాగుతుండగా తన విద్యా జీవితంలోని కొన్ని సంఘటనలు గుర్తు చేసుకొన్నారు. తనను తన వార్డెన్ నాలుగు సార్లు కొట్టారని చెప్పారు. ఓ సారి రాత్రిపూట ఎవరికి చెప్పకుండా బిలియర్డ్స్ గేమ్ ఆడుతుండగా మా హాస్టల్ వార్డెన్ పట్టుకొన్నారు. అలా ఓ సారి దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పుడు స్కూల్‌లో దెబ్బలు కొట్టడంపై నిషేధం విధించారు. కానీ అప్పట్లో ఉపాధ్యాయులకు దండించే హక్కు ఉండేది అంటూ అమితాబ్ చమత్కరించారు.

  5000000 రూపాయల కోసం ప్రశ్న

  5000000 రూపాయల కోసం ప్రశ్న

  అలా భావోద్వేగాలను పంచుకొంటూ... కేబీసీ గేమ్‌లో ఎలాంటి తడబాటు లేకుండా తుషార్ చకచకా ప్రశ్నలకు సమాధానం చెప్పి 25 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకొన్నారు. 25 లక్షల ప్రశ్న వద్ద తుషార్ తడబడి తన చివరి లైఫ్ లైన్ కూడా ఉపయోగించుకొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి 25 లక్షల రూపాయలు గెలుచుకొన్నారు. అలా సాగిపోతున్న సమయంలో తుషార్ ముందుకు 50 లక్షల ప్రశ్నను బిగ్ బీ ఉంచారు.

  Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
  5000000 రూపాయల ప్రశ్న ఏమిటంటే?

  5000000 రూపాయల ప్రశ్న ఏమిటంటే?


  తుషార్ భరద్వాజ్ ముందు అమితాబ్ బచ్చన్ ఉంచిన 5000000 ప్రశ్న ఏమిటంటే..

  భారతీయ సినిమాకు తొలి నటిని పరిచయం చేస్తూ దుర్గాభాయ్ కామత్‌ను దాదా సాహెబ్ ఫాల్కే ఏ సినిమాను రూపొందించారు?
  a) సత్యవాన్ సావిత్రి
  b) మోహిని భస్మాసుర్
  c) లంకా దహన్
  d) గంగావతరణ్

  పై ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన తుషార్ భరద్వాజ్ గేమ్ నుంచి క్విట్ అయ్యారు. అప్పటి వరకు సంపాదించిన 25 లక్షల రూపాయలను తీసుకొని గేమ్ నుంచి నిష్క్రమించారు.

  అయితే ఆ ప్రశ్నకు సమాధానం.. (b) మోహిని భస్మాసుర్

  English summary
  Teacher Tushar Bharadwaj of boarding school in Tezpur, Assam. Tushar in KBC 13. He faces 5000000 question in September 8th episode by Amitabh Bachchan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X