»   » కొత్త టీవీ షోలో మెగాస్టార్ (వీడియో)

కొత్త టీవీ షోలో మెగాస్టార్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అభిమానులకు శుభవార్త. ఆయన ఒక కొత్త టీవీ షోలో నటించనున్నారు. ఆయన గతంలో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసందే. ఇప్పుడు కొత్తగా 'ఆజ్‌ కి రాత్‌ హై జిందగీ' అనే కార్యక్రమంలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా తెలియజేశారు. ఈ పోగ్రామ్ కోసం ఛానెల్ వారు చేసిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ చూడండి.


అమితాబ్ మాట్లాడుతూ.... తన టెలివిజన్‌ జర్నీని స్టార్‌ ఇండియాతో ప్రారంభించానని.. స్టార్‌ప్లస్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇప్పుడు ఓ మంచి టీవీ షో ద్వారా ప్రజల ముందుకు వస్తున్నట్లు అమితాబ్‌ తెలిపారు.
Amitabh Bachchan to Star in New TV Show

'ఆజ్‌కి రాత్‌ హై జిందగీ' కార్యక్రమం గురించి వినగానే.. వెంటనే దానికి కనెక్ట్‌ అయిపోయానన్నారు. మీడియా మాత్రమే ప్రజల్లో మార్పు తీసుకురాగలదని తాను అనుకునేవాడినని.. ఇప్పుడు దానిని వినోదాత్మకంగా కూడా చేయవచ్చని అర్థమైందని అమితాబ్‌ అన్నారు. ఈ టీవీ షో చాలా వినోదాత్మకంగా ఉంటుందని ఆయన అన్నారు.

Amitabh Bachchan to Star in New TV Show
English summary
Megastar Amitabh Bachchan is all set to appear in an upcoming TV show Aaj Ki Raat Hai Zindagi. The 72-year-old actor is expected to don a never-been-seen look for the new show.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu