»   » అమితాబ్ మళ్లీ అదరగొట్టేశాడు.. ఆ గేమ్ చూస్తే ఫిదా కావాల్సిందే..

అమితాబ్ మళ్లీ అదరగొట్టేశాడు.. ఆ గేమ్ చూస్తే ఫిదా కావాల్సిందే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గంభీరమైన గొంతు.. ఆకట్టుకునే స్వరం.. వాహ్.. అనిపించే వాక్చాతుర్యం. వీటన్నిటినీ ఒక్కదగ్గర చేరిస్తే.. అది బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ అవుతుంది. మామూలుగా అమితాబ్ మాట్లాడుతుంటేనే.. మురిపెంగా చూస్తుంటాం. ఇంక.. స్టేజ్ మీద షో ను హోస్ట్ చేస్తూ.. తన గంభీరమైన స్వరాన్ని అమితాబ్ పలికిస్తుంటే.. ఊరుకోలేం కదా. కౌన్ బనేగా కరోడ్ పతి తొమ్మిదో సీజన్ చూస్తున్నవాళ్లంతా ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 వాట్ ఎ స్టైల్.. వాట్ ఏ మేనరిజం

వాట్ ఎ స్టైల్.. వాట్ ఏ మేనరిజం

ఎన్ని సీజన్లు చేసినా.. ఎన్ని షో లు చేసినా.. తరగని స్మైల్.. చెరగని స్టైల్ ను కొనసాగించడం అమితాబ్ కు అలవాటు. ఇప్పుడు.. అదే అలవాటును తొమ్మిదో సీజన్ ఆఫ్ కౌన్ బనేగా లోనూ బిగ్ బీ కంటిన్యూ చేసేస్తున్నాడు. తనకే సాధ్యమైన ఛరిష్మా చూపిస్తూ.. మాయ చేసేస్తున్నాడు. బిగ్ బీ అంటే.. ఇంకా అయిపోలేదని.. చాలా విషయం దాగి ఉందని.. తన యాంకరింగ్ తో మ్యాజిక్ చేసి మరీ చెబుతున్నాడు.

మూడేళ్లుగా ఏమైపోయాడు??

మూడేళ్లుగా ఏమైపోయాడు??

కౌన్ బనేగా కరోడ్ పతి షో ను.. బిగ్ బీ హోస్ట్ చేసినంతగా మరే స్టార్ కూడా చేయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని కేబీసీ ఫ్యాన్స్ స్వయంగా చెబుతున్నారు. మూడేళ్లుగా.. బిగ్ బీ లేకపోవడంతో.. కేబీసీ షో బోసిపోయినట్టుగా అనిపించిందని అంటున్నారు. ఇప్పుడు.. తొమ్మిదో సీజన్ కేబీసీ మొదలైంది అన్న విషయం కంటే.. అమితాబ్ హోస్ట్ గా రావడం.. చాలా ఆనందంగా ఉందని పట్టరాని సంతోషాన్ని ప్రదర్శిస్తున్నారు.. బిగ్ బీ ఫ్యాన్స్.

అదే క్విజ్.. అదే మ్యాజిక్

అదే క్విజ్.. అదే మ్యాజిక్

పాటర్న్ మారలేదు. ప్రశ్నలు అడిగే విధానం కూడా మారలేదు. 16 ప్రశ్నలు. ప్రతీ ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా చెబుతూ పోతే.. ప్రైజ్ మనీ పెరుగుతూ పోతుంది. మధ్యలో లైఫ్ లైన్స్.. సేఫ్ పాయింట్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో కొత్తేముంది అని ఎవరైనా అంటారేమో. గత మూడు ఏళ్లుగా కేబీసీలో కనిపించని బిగ్ బీ అమితాబ్.. రీ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చాడు. గతంలో మాదిరిగానే.. కేబీసీని ఒంటిచేత్తో మోసేస్తూ.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు.. బిగ్ బీ.

ఆకట్టుకుంటున్న సర్ ప్రైజ్ లు

ఆకట్టుకుంటున్న సర్ ప్రైజ్ లు

గేమ్ షో లో పార్టిసిపేట్ చేస్తున్నవాళ్ల సంగతి ఓకే. మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అనేవాళ్లకు.. కేబీసీలో కనిపిస్తున్న కాస్త కొత్తదనం.. జవాబు చెబుతోంది. ఇన్నాళ్లూ ఫోన్ ఎ ఫ్రెండ్ పేరుతో ఉన్న లైఫ్ లైన్ ను.. ఇప్పుడు జోడీదార్ గా మార్చేశారు. ఇందులో.. కంటెస్టెంట్ హెల్ప్ తీసుకోవాలనుకున్నపుడు.. ఆమె/అతను కోరిన ఫ్రెండ్ కు వీడియో కాల్ చేస్తారు. డిజిటల్ గా.. వాళ్లను కూడా హాట్ సీట్ లో కూర్చోబెట్టిన అనుభూతి కల్పిస్తారు. అలాగే.. విజేతలకు చెక్ ఇవ్వకుండా.. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా.. ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేసే విధానాన్ని ఈ సిరీస్ లో తీసుకొచ్చారు. అంతే కాదు.. జాక్ పాట్ ప్రశ్నకు ఇచ్చే బహుమతి మొత్తాన్ని 5 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయలకు పెంచారు.

ఇంతేనా.. ఇంకేం లేదా?

ఇంతేనా.. ఇంకేం లేదా?

అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి తొమ్మిదో సీజన్ లో.. ఇంకా ఆశించేవాళ్లకు.. కొత్తదనం కోరుకునేవాళ్లకూ.. కంటెస్టెంట్ల రూపంలో సమాధానం దొరుకుతోంది. తనకే సాధ్యమైన ప్రెజెంటేషన్ తో షో నడిపించేస్తున్న బిగ్ బీ.. హాట్ సీట్ కు వచ్చిన ఓ కంటెస్టెంట్.. తనకు అభిషేక్ అంటే ఇష్టమని చెప్పగానే.. ఫోన్ చేసి మాట్లాడించేశాడు. అంతే కాదు.. సిటీ కల్చర్ కు చెందిన వాళ్లతోనే కాక.. సేవాగుణం ఉన్నవాళ్లకూ.. పల్లెల నుంచి ఎదిగిన.. మంచి లక్ష్యం ఉన్న వాళ్లకూ.. షో లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇది కూడా.. అందరినీ ఆకట్టుకునే పాయింటే.

ఫైనల్ గా…

ఫైనల్ గా…

కాస్త కొత్తదనం.. మరింత వినోదనం.. వాటికి మించి.. బిగ్ బీ అమితాబ్ మేనరిజం చూడాలనుకునేవాళ్లు.. మేధస్సుకు పదును పెట్టాలనుకునేవాళ్లు.. కౌన్ బనేగా కరోడ్ పతితో.. ఫుల్ల్ గా అనుకున్నవన్నీ పొందేయొచ్చు.

English summary
The 9th season Of India's favorite game show Kaun Banega Crorepati begins on August 28. The grand curtain raiser episode has already raised our expectations from the show. With a lot of changes in the format of the show, this season aims to entertain the audience like never before. Over the years there have been some moments on the show that viewers can never forget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu