»   » కేబీసీ హోస్ట్‌ ఖరారు.. ఐష్, మాధురీలకు షాక్..

కేబీసీ హోస్ట్‌ ఖరారు.. ఐష్, మాధురీలకు షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానున్న ఆగస్టులో కౌన్ బనేగా కరోడ్‌పతి 9వ సీజన్ ప్రారంభం కానున్నది. ఈ సీజన్‌‌కు కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 2000లో ప్రారంభమైన కేబీసీకి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొమ్మిదో సీజన్‌కు మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్‌లను ఎంపిక చేయాలని, ప్రధానంగా మహిళా హోస్ట్‌కు అవకాశం ఇవ్వాలని సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ భావించింది. అయితే అలాంటి నిర్ణయాలను పక్కనపెడుతూ అమితాబ్‌ను కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నారు.

30 ఏపిసోడ్లకు గ్రీన్ సిగ్నల్

30 ఏపిసోడ్లకు గ్రీన్ సిగ్నల్

కేబీసీ తొమ్మిదో సీజన్ గురించి గత డిసెంబర్‌లో ప్రకటన వెలువడింది. ఆగస్టులో ఈ కార్యక్రమానికి సెట్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఈ సీజన్‌లో మొత్తం 30 ఎపిసోడ్లకు అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని నిర్వాహకులు వెల్లడించారు. సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ.. కేబీసీ కోసం బిగ్ బీ డేట్లను అడ్జస్ట్ చేశారనేది తాజా సమాచారం.

ఆగస్టు నుంచి షూటింగ్..

ఆగస్టు నుంచి షూటింగ్..

కేబీసీ 30 ఎపిసోడ్ల షూటింగ్‌కు ఆగస్టు నుంచి అమితాబ్ హాజరుకానున్నారు. ఆగస్టులో 10 రోజులు, సెప్టెంబర్‌లో 7 రోజులు బిగ్ బీ కేటాయించినట్టు సమాచారం. షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను చకచకా చేస్తున్నట్టు తెలుస్తున్నది.

సల్మాన్, ఐష్, మాధురీ పేర్ల పరిశీలన.

సల్మాన్, ఐష్, మాధురీ పేర్ల పరిశీలన.

అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం కారణంగా మరో సెలబ్రిటీని కేబీసీ కోసం తీసుకోవాలని నిర్వాహకులు ఆలోచించారు. అందుకోసం సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, మాజీ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ను హోస్ట్‌గా తీసుకోవాలనే ఆలోచించారు. అయితే బాలీవుడ్ షహెన్షా బిగ్ బీ లేకుండా కేబీసీకి గ్లామర్ రాదని నిర్ణయానికి వచ్చిన నిర్వాహకులు ఆయననే కొనసాగిస్తున్నారు.

కేబీసీకి బిగ్ బీతో గ్లామర్..

కేబీసీకి బిగ్ బీతో గ్లామర్..

2000లో ప్రారంభమైన కేబీసీకి అమితాబ్ బచ్చన్ స్టార్‌గా మారారు. ఈ కార్యక్రమం కోసం టీవీ వీక్షకులను పరుగులు పెట్టించారు. అద్భుతమైన ప్రతిభతో కేబీసీ రియాల్టీ షోను దేశంలోనే నంబర్ టెలివిజన్ కార్యక్రమంగా మార్చివేశారు. ఇక అమితాబ్ లేకుంటే ఈ షోకు అసలు గ్లామరే ఉండదనే భావనను కల్పించడంలో బిగ్ బీ సఫలమయ్యాడు.

English summary
Amitabh Bachchan will begin shooting for Kaun Banega Crorepati's ninth season this August. A number pf Bollywood stars were considered to host KBC 9. According to reports,the names of Salman Khan, Aishwarya Rai Bachchan and even Madhuri Dixit Nene were doing the rounds. However, we all know that KBC would not be the same without the Shehanshah of Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu