ఆ ఛానెల్ కు కౌంటర్ ఇవ్వటానికే...షోలో ఆయన్ను?
ముంబై: టీవి ఛానెల్స్ మధ్య పోటీ సహజం. ఒక ఛానెల్ లో సూపర్ హిట్ ఓ పోగ్రాం అయితే ఆ ఛానెల్ కు పోటీ ఛానెల్ కౌంటర్ ఇవ్వటానికి సిద్దమవుతూంటుంది. ముఖ్యంగా నేషనల్ ఛానెల్స్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూంటాయి. తాజాగా కౌన్‌బనేగా కరోడ్‌పతి పోగ్రామ్ కు కౌంటర్ గా ఓ పోగ్రాం ని రెడీ చేయటానికి ప్రత్యర్ధి ఛానెల్ సిద్దమవుతోంది.
కౌన్‌బనేగా కరోడ్‌పతి, యుధ్ వంటి సూపర్ హిట్ టీవీ షోల తర్వాత అమితాబ్ బచ్చన్ మరో టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ సిరీస్ 'టునైట్స్ ద నైట్'కి అనుసరణగా వస్తున్న టీవీ షోని బిగ్‌బీ హోస్ట్ చేయనున్నారు.సాధారణ ప్రజలు తమ కలలను నిజజీవితంలో సాకారం చేసుకొనే అవకాశం కల్పించడమే ఈ షో ప్రత్యేకత.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కేబీసీ కార్యక్రమం తొలి 3 సీజన్లు ప్రసారం చేసిన ఛానల్‌కి ప్రత్యర్థి ఛానెల్ GEC (General Entertainment Channel)లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దాంతో ఇప్పుడు కరోడ్‌పతి కార్యక్రమానికి కొత్త వ్యాఖ్యాత రానున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
అమితాబ్ కొత్త చిత్రం విషయానికి వస్తే..
అమితాబ్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అదితీరావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వాజిర్'. ఈ చిత్రానికి విధువినోద్ చోప్రా నిర్మాత. 'సైతాన్'తో ఆకట్టుకున్న బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫరాన్ అక్తర్ ఉగ్రవాద నిరోధక అధికారిగా నటిస్తున్నాడు.
జాన్ అబ్రహం, నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్ర తాజా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అమితాబ్ పొడవాటి జుట్టు, కోరమీసంతో కొత్తగా కనిపిస్తున్నారు. చిత్రంలో అమితాబ్ పాత్ర ఏమిటనేది సస్పెన్స్‌గా ఉంది. డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











