twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆటో వాడితో ఎలా మాట్లాడేదాన్నో గల్లీ కార్నర్ నుంచి చూసేవారు.. తండ్రిపై అనసూయ కామెంట్స్

    |

    బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్‌గా, వెండితెరపై రంగమ్మత్తలాంటి క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అనసూయ. అయితే అనసూయ ఈ స్థాయికి రావడానికి మాత్రం ఎంతో కష్టపడింది. తన వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో మలుపులున్నాయి. ఈ విషయాలన్నీ తాజాగా అనసూయ వివరించింది. తన తండ్రి, భర్త సుశాంక్, కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

    పవిత్ర నుంచి అనసూయ..

    పవిత్ర నుంచి అనసూయ..

    మా నాన్న సైడ్ వాళ్లకు అమ్మాయిలు లేరు. ముగ్గురబ్బాయిలకు నేను మొదటి అమ్మాయిని. అందుకే నానమ్మ పేరును నాకు పెట్టారు. అయితే అంతకు ముందే మా అమ్మ పవిత్ర అనే పేరు నాకు పెడదామని అనుకుందట. కానీ నాన్న మాత్రం వాళ్ల అమ్మ పేరునే నాకు పెట్టారు. అందుకే అనసూయ అని పెట్టేశారు. నాకు ఊహ తెలియక ముందే నా పేరు మారిపోయింది. అని అనసూయ తన పేరు వెనకున్న కథను వివరించింది.

    పేరంటే నచ్చదు..

    పేరంటే నచ్చదు..

    అనసూయ పేరు అంటే మొదట్లో నచ్చేది కాదు. స్కూల్లో కావాలనే, ఏడిపించేందుకు అనసూయ అని గట్టిగా పిలిచేవారు. రిజిష్టర్‌ల్ అను అని రాయించాను, అను అని పిలిస్తేనే ప్రజెంట్ అని చెప్పేదాన్ని. ఎన్‌సీసీలో వెళ్లాక నా పేరు గొప్పదనం, తెలిసింది. అప్పటి నుంచి అనసూయ పేరును మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను అని పేర్కొంది.

     అలా మొదలైంది..

    అలా మొదలైంది..

    ఎన్‌సీసీ క్యాంప్‌లోనే శశాంక్ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుందామా? అని డైరెక్ట్ అడిగాడు. అదే ఆయనలో నాకు నచ్చింది. అదే విషయాన్ని మా అమ్మతో చెప్పాను. ఒకతను నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు అని అమ్మతో చెప్పేశాను. అక్కడి నుంచి తొమ్మిదేళ్లు కష్టాలు పడి ఒక్కటయ్యామని వివరించింది.

    Recommended Video

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    అలా పెంచారు..

    అలా పెంచారు..

    మేము ముగ్గురు అక్కాచెల్లెలమి. మమ్మల్ని మా డాడీ బావిలో కప్పల్లా పెంచారు.అయితే అదే సమయంలో ఎంత గట్టిగా ఉండాలో కూడా నేర్పించారు. ఆటోతో ఎలా మాట్లాడాలే నేను పదో తరగతిలో నేర్చుకున్నా. నేను ఆటో వాడితో ఎలా మాట్లాడుతున్నా.. నేను అడుగుతుండే వాడు ఎలా చూస్తున్నాడు.. ఏరకంగా ప్రవర్తిస్తున్నాడు అని గల్లీలో కార్నర్ నుంచే చూసేవాడు అని అనసూయ చెప్పుకొచ్చింది.

    English summary
    Anasuya Bharadwaj About His Father Caring Nature. Anasuya shares About Her Love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X