For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయ రెండో పెళ్లి చేసుకో.. మీసాలు, గడ్డాలతో అంటీ అంటారా అని యాంకర్ ఫైర్

  By Rajababu
  |
  రెండో పెళ్లిపై నోరువిప్పిన అనసూయ..!

  న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అంచెలంచెలుగా ఎదుగుతూ యాంకర్‌గా, సినీ నటిగా బ్రహ్మండంగా రాణిస్తున్నారు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఫేస్‌బుక్‌లో లైవ్ కనిపిస్తూ అభిమానులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే శనివారం అనసూయ ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చి నెటిజన్లకు షాక్ ఇచ్చారు. కొన్ని రోజులుగా 'సచ్చిందిరా గొర్రె' చిత్ర షూటింగ్ నిమిత్తం నైట్ షూటింగ్‌లో ఉండటం వల్లే, ఫేస్‌బుక్ లైవ్‌లోకి రాలేకపోయానని అనసూయ చెప్పారు. అయితే నెటిజన్లు అడిగిన సమాధానం చెబుతూ జబర్దస్త్ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా కొందరు అడిగిన పిచ్చి ప్రశ్నలకు ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. . మీరే చూడండి..

   జబర్దస్త్ చరిత్ర సృష్టించింది

  జబర్దస్త్ చరిత్ర సృష్టించింది

  వినోదరంగంలో జబర్ధస్త్ కామెడీ షో చరిత్ర సృష్టించింది అని ఒప్పుకొని తీరాల్సిందే. తెలుగులోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జబర్దస్త్‌కు ఫాలోవర్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ చూరగొంటున్నది. నేను. ఒక షో.. సింగిల్ సీజన్‌లో ఇంతగా ఆదరణ దక్కించుకోవడమనేది గతంలో ఎన్నడూ జరగలేదు. తెలుగు టెలివిజన్‌ రంగాన్ని, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని టాప్ లెవల్‌లో నిలబెట్టిన ఘనత జబర్ధస్త్‌ది.

   జబర్దస్త్ ఓ బాహుబలి

  జబర్దస్త్ ఓ బాహుబలి

  సినిమా రంగంలో బాహుబలి ఎలానో టెలివిజన్ రంగంలో జబర్ధస్త్ కూడా అంతే. అలాంటి విజన్‌ని ఇందులో చూస్తున్నాం. ఈ కామెడీ షోను ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబు, ఇతర టీమ్ మెంబర్స్ ఎంతో కష్టపడుతున్నారు. చాలా మంది ఎంతో హార్డ్‌వర్క్ చేస్తున్నారు.

   వివాదంపై అనసూయ స్పందన

  వివాదంపై అనసూయ స్పందన

  బహుళ ప్రజాదరణను పొందిన అలాంటి కార్యక్రమంపై మరో విధంగా వ్యాఖ్యలు చేయకూడదు. క్రియేటీవిటీని తొక్కేయవద్దు. ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ.. గుమ్మడికాయ దొంగల్లా రియాక్ట్ అవుతున్నారు. మేం ఎలాంటి కార్యక్రమాలు చేసిన మంచి కోరే చేస్తాం. ఏదైనా ఇబ్బంది ఉంటే దానిని మరో రకంగా చూడకూడదు అని ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ గురించి స్పందించారు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు' అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

  ఏడిపించడం మా ఉద్దేశం కాదు

  ఏడిపించడం మా ఉద్దేశం కాదు

  జబర్ధస్ కార్యక్రమం కేవలం హాస్యం కోసం మాత్రమే. జీవితంలో ఎదురయ్యే అన్ని అంశాలను జబర్ధస్త్ కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నది. మిమ్మల్ని నవ్వించే వాళ్లందరిని ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందా? కొందరు స్పందించే తీరుపై నటీనటులు భయపడే అవకాశం ఉంది. ఏదైనా చేయాలంటే ముందు వెనుక ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల మంచి కంటెంట్‌ను అందించలేం.

   జబర్దస్త్ కించపరచడానికి కాదు

  జబర్దస్త్ కించపరచడానికి కాదు

  ఎవర్నో కించపరుచడానికి జబర్దస్త్ కార్యక్రమాన్ని చేయడం లేదు. ప్రేక్షకులు రోజంతా కష్టపడి అలసిపోయి వస్తారు. వాళ్లంతా నవ్వుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. దీని వెనుక దురుద్దేశాలు లేవు. ఎలాంటి ఎపిసోడ్స్‌నైనా చూసి ఎంజాయ్ చేయండి. వివాదం చేయవద్దు అని అన్నారు.

   సమాజంలో చాలా విషయాలున్నాయ్

  సమాజంలో చాలా విషయాలున్నాయ్

  దేశంలో, మనం నివసించే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చెడుపోయిన రోడ్లు, కరెంట్, విద్య, బాలికలపై హత్యాచారం.. ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మీకు వినోదాన్ని ఇచ్చే ఈ అంశమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇదే నా అభిప్రాయం అని అనసూయ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

   ఆంటీ అంటే బూతులా

  ఆంటీ అంటే బూతులా

  ఫేస్‌బుక్‌లో నెటిజన్లతో మాట్లాడేటప్పుడు ఓ నెటిజన్ హాయ్‌ అనూ ఆంటీ అంటూ కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్‌పై అనసూయ అతడికి ఘాటుగా బుదులిచ్చారు. ఆంటీ అంటే అదో బూతు పదంలా చేసేశారు. నేను చాలా మందిని ఆంటీ అంటూ సంబోధిస్తుంటాను. వాళ్లందరూ బూతులా ఫీల్‌ అవ్వాలా. ఇంకోసారి దీనిపై స్పందించను. కాస్త చదువుకున్నవారిలా ప్రవర్తించండి అని అనసూయ అన్నారు.

   నన్ను ఆంటీ అంటారా?

  నన్ను ఆంటీ అంటారా?

  నా పిల్లల స్నేహితులు ఆంటీ అంటే పలుకుతా కానీ, మీసాలు గడ్డాలు పెట్టుకొని మీరు నాకు అంకుల్‌లా ఉండి ఆంటీ అనడం ఏమిటండి అంటూ మండిపడ్డారు. నేను చాలా మంచి మూడ్‌లో ఉన్నా కాస్త సరదగా సంభాషిద్దాం అంటూ ఫేస్‌ బుక్‌ లైవ్‌ను ప్రారంభించారు.

   రెండో పెళ్లిపై అనసూయ స్పందన

  రెండో పెళ్లిపై అనసూయ స్పందన

  చాటింగ్ సందర్భంగా తనని రెండో పెళ్లి చేసుకుంటావా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ తెలివిగా సమాధానం ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మా ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నారు. నెటిజన్ కోరిన కోరికను అనసూయ సున్నితంగా తిరస్కరించారు.

  సచ్చిందిరా గొర్రె సినిమాలో

  ప్రస్తుతం సచ్చిందిరా గొర్రె చిత్రంలో నటిస్తున్నాను. సినిమాలో నేనొక్క దాన్నే అమ్మాయిని. కమెడియన్లు శ్రీనివాసరెడ్డి, వేణు,‌ రాకేష్‌, ఆనంద్‌తో ఒక్కదాన్ని మాత్రమే మెయిన్‌ రోల్‌లో నటిస్తున్నారు అని సినిమా గురించి విశేషాలను వెల్లడించారు.

  English summary
  Anchor, Actor Anasuya latest movie is Sachchindira Gorre. She teamed up With Srinivas Reddy, Venu, Rakesh, Anand. Recently she take time to meet netizen via Social media. She fired on one calling her Aunty. She advised not create any contravarcy on Jabardast.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X