ఆ ఇద్దరే కారణమంటున్న అనసూయ.. జబర్దస్త్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లేనా..?

Recommended Video

Anchor Anasuya Latest Tweet About Popular Comedy Show

ప్రతీ వారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో జబర్దస్త్. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రతీ స్కిట్ లోనూ ఆమెపై వేసే పంచులే ప్రధాన ఆకర్షణ. ఎలాంటి పంచులేసినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్‌ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. అయితే జబర్దస్త్‌కి అనసూయ గుడ్ బై చెప్పనుందని ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఓ వార్త కలవరపెడుతోంది. ఈ లోగా జబర్దస్త్ దర్శకులపై అనసూయ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

 జబర్థస్త్ ప్రోగ్రామ్ ఐదేళ్లైన సందర్భంగా

జబర్థస్త్ ప్రోగ్రామ్ ఐదేళ్లైన సందర్భంగా

జబర్థస్త్ ప్రోగ్రామ్ ప్రారంభించి ఐదేళ్లైన సందర్భంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ట్వీట్ చేసింది. ఈ ఐదేళ్లలో తనను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జబర్దస్త్ దర్శకులు నితిన్, భరత్‌ల గురించి ప్రస్తావించింది అనసూయ. ఈ మేరకు జబర్దస్త్ సక్సెస్ కావడానికి ఆ ఇద్దరే కారణమని పేర్కొంది.

ప్రశంసలు, విమర్శలు రెండూ వచ్చాయి

జబర్దస్త్ పై ప్రశంసలు, విమర్శలు రెండూ వచ్చాయి. అయినా ప్రతివారం లక్షలాది మందిని నవ్విస్తూ ఈ షోని ముందుకు తీసుకెళ్ళాం. దాదాపు అర్ధ దశాబ్దం దాటినా ఈ షోను విజయవంతంగా కొనసాగిస్తున్నాము. ఇందుకు దర్శకులు నితిన్, భరత్ ల కృషియే కారణమని అనసూయ పేర్కొంది.

 ఇలాగే 50 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటూ

ఇలాగే 50 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటూ

జబర్దస్త్ సెట్స్‌లో ఏ ఫిర్యాదు చేయాలనుకున్నా, అదేవిధంగా ఏ విధమైన సలహాలు కావాలన్నా ఈ ఇద్దరు దర్శకులు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చేవారని అనసూయ పేర్కొంది. ఆ దర్శకులిద్దరూ జీవితంలో సరికొత్త ఫీట్స్ సాధించాలని కోరుకుంటున్నానని, ఈ ప్రోగ్రామ్ ఇలాగే 50 ఏళ్ల పాటు కొనసాగాలని అనసూయ తన సందేశంలో రాసుకొచ్చింది.

 ఇంతకీ క్లారిటీ వచ్చినట్లేనా..?

ఇంతకీ క్లారిటీ వచ్చినట్లేనా..?

ఈ నేపథ్యంలో సినిమాలతో బిజీ అయిన కారణంగా అనసూయ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పనుందని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూనే అనసూయ ఈ ట్వీట్ చేసిందా? లేక ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా విషెస్ తెలిపిందా? అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. జబర్దస్త్ గుడ్ బై విషయమై ఆమె ట్వీట్‌లో ప్రస్తావించలేదు.. పైగా ఇంకా 50 ఏళ్ళు ఇలాగే సక్సెస్ ఫుల్‌గా జబర్దస్త్ రన్ కావాలని కోరుకుంది కాబట్టి తాను జబర్దస్త్ యాంకర్‌గా కంటిన్యూ చేస్తున్నానని చెప్పకనే చెప్పేసిందని అర్థం చేసుకోవచ్చు.

అనసూయ సినిమాలు

అనసూయ సినిమాలు

ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, ఎఫ్ 2, యాత్ర లాంటి సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకొని ఇప్పుడు 'కథనం' డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మెగాస్టార్- కొరటాల శివ కాంబోలో రానున్న కొత్త సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించనుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X