7C అంటూ అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ట్రోలింగ్ కు దిమ్మతిరిగే రిప్లై.. ఏంటంటే?
తెలుగు టెలివిజన్ రంగంలో టాలెంటెడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాపులర్ తెలుగు కామెడీ షో జబర్దస్త్ వేదికపై దాదాపు 10 ఏళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. తన అందం, యాంకరింగ్ స్కిల్స్, తన డ్యాన్స్ స్కిల్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. బుల్లితెరపై ఆమె చేసిన రచ్చకు ఏకంగా టాలీవుడ్ సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయంటే అతిశయోక్తి కాదు. అయినా అనసూయా ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రల్లో నటించేందుకు ఒప్పుకోలేదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఓకే చెప్పింది.
తనదైన శైలిలో యాంకర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకులను వెండితెరపై ఇప్పటికీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ నటిగా భారీ చిత్రాల్లో కూడా అనసూయ అవకాశాలు అందుకుంటూ వస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన తర్వాత అనసూయ రేంజ్ మారిపోయింది. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ దక్కింది. అలాగే పుష్పలో దాక్షయాణి పాత్రతోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో అనసూయ కెరీర్ కూడా అప్పటి నుంచి దూసుకెళ్తోంది.

ఇలా వరస చిత్రాలతో అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులను ప్రస్తుతం వెండితెరపై అలరిస్తూ వస్తోంది. అయితే అనసూయ ఈ స్థాయికి ఎదగడం అనేది అంత సులువుగా జరగలేదు. ఎన్నో ట్రోల్స్ ను, ఎంతో వ్యతిరేకతను, కెరీర్ లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను దాటుకొని వచ్చింది. ఇక అనసూయ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ విషయంలో చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంది. అయితే ట్రెల్స్ కు ఎప్పటికప్పుడు అనసూయ భరద్వాజ్ ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానాలు ఇస్తూనే వస్తోంది.
అయితే తాజాగా తను ధరించిన దుస్తులపై ఆసక్తికరమైన పోస్టులను పెట్టింది. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ ఐస్లాండ్ కు వెకేషన్ కోసం వెళ్లింది. ఈ సందర్భంగా వరుసగా అక్కడి నుంచి బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటోంది. కాగా తాజాగా నిండైన దుస్తుల్తో క్యూట్ గా మెరిసింది. పింక్ టాప్, జీన్స్ వేర్ లో ధరించి నెట్టింట మెరిసింది. ఆ ఫొటోలను పంచుకుంటూ తన దుస్తులపై, డ్రెస్సింగ్ సెన్స్ పై ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు గతంలో తన డ్రెస్సింగ్ పైన ట్రోల్ చేసిన వారికి కూడా గట్టిగా బదులిచ్చింది.
తన ఫొటోలను పంచుకుంటూ అనసూయ భరద్వాజ్ 7Cగా డ్రెస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. 7Cలో స్పష్టమైన, సంక్షిప్తమైన, సమగ్రమైన, సరైన, స్థిరమైన, నిండుదనంగా, మర్యాదపూర్వకమైన విధానంలో డ్రెస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. లేటెస్ట్ లుక్ లో కెమెరాలకు ఫోజులిచ్చానని, చుట్టూ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గుర్రపు పిల్లలతో ఆడుకుంటూ అటూ ఇటూ తిరగానని తన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. ఇక లేటెస్ట్ లుక్ లో అనసూయ మరింత యంగ్ గా కనిపిస్తున్నారంటూ తన అభిమానులు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్ కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.


Click it and Unblock the Notifications











