For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా హీరో‌తో అనసూయ.. ఫ్యాన్స్ ఊహించని పాత్రలో జబర్దస్త్ యాంకర్!

  |

  మొట్టమొదట బుల్లితెరపై పలు షో లకు యాంకరింగ్ చేసి ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్న అనసూయ భరద్వాజ్, ఆ తరువాత ఈటివి లో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా మరింత క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఆమె యాంకరింగ్ స్టైల్ కి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే గ్లామర్ తో కూడా ఎప్పటికప్పుడు కుర్రాళ్ళ మతి పోగొట్టేలా షాక్ ఇస్తోంది. అయితే ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా వెండితెర అవకాశాలు అందుకున్న అనసూయ మరో మెగా హీరో సినిమాలో అనసూయ పవర్ఫుల్ పాత్రలో కనిపించే ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వస్తోంది.

  Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

  ఆ పాత్రతోనే కెరీర్ యూ టర్న్

  ఆ పాత్రతోనే కెరీర్ యూ టర్న్

  యువ నటుడు అడివి శేష్ నటించిన క్షణం మూవీలో అనసూయ చేసిన నెగిటివ్ పాత్రకు రెస్పాన్స్ ఏ రేంజ్ లో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరి నుండి మంచి ప్రశంసలు పేరు అందుకున్నారు. అలానే ఆపై కథనం, గాయత్రి వంటి మూవీస్ లో కూడా విబిన్నంగా నటించిన అనసూయ, అనంతరం ఏకంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు అత్తగా కనిపించింది.

  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ కు మరొక కీలక మలుపు అని చెప్పవచ్చు. కాగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన అనసూయ ప్రేక్షకుల రివార్డులతో పాటు పలు అవార్డులు కూడా అందుకున్నారు.

  Nabha Natesh చీరకట్టులో పరువాలు పంచిన ఇస్మార్ట్ బ్యూటీ

  పుష్పతో కూడా పవర్ఫుల్ రోల్

  పుష్పతో కూడా పవర్ఫుల్ రోల్

  రంగస్థలం నుండి అనసూయకు మరింతగా వెండితెర అవకాశాలు పెరిగాయి. ఇటీవల వైఎస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్రలో కూడా ఒక కీలక పాత్ర చేసిన అనసూయ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ తీస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప లో కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో అయితే లీక్ అయ్యాయి.

  మెగాస్టార్ బర్త్ డేలో రాఖీ సెలబ్రేషన్స్.. మెగా హీరోలంతా ఓకే ఫ్రేమ్ లో కన్నుల పండుగగా..

  మెగాస్టార్ తో కూడా

  మెగాస్టార్ తో కూడా

  అయితే లేటెస్ట్ గా ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రీసెంట్ గా మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాకు గడ్ ఫాదర్ అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. ఇక ఈ కమర్షియల్ పొలిటికల్ సినిమాలో అనసూయ ఒక బంపర్ అఫర్ దక్కించుకున్నట్లు చెప్తున్నారు.

  Hero Balakrishna Appreciates Natyam Team | నమః శివాయా అద్భుతమైన పాట
  అనసూయ స్పెషల్ రోల్

  అనసూయ స్పెషల్ రోల్

  కొన్నాళ్ల క్రితం మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు దీనిని ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన ఒక పాత్ర కోసం అనసూయని ఎంపిక చేసినట్లు టాక్ వస్తోంది.

  ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని కూడా అంటున్నారు. ఇటీవల ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విధంగా మెగా కాంపౌండ్ వదలని అనసూయ ఏదో విధంగా వారి సినిమాల్లో నటిస్తున్న మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది. మరి ఈ సినిమాలు ఆమెకు నటిగా ఇంకా ఏ స్థాయిలో గుర్తింపుని అందిస్తాయో చూడాలి.

  English summary
  Anchor anasuya bharadwaj special role in another big budget movie..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X