Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాలీవుడ్ లో మరో తీవ్ర విషాదం.. ఈసారి యాంకర్ అనసూయ ఇంట.. ఏం జరిగిందంటే?
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో తీవ్ర విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కు సంబందించిన మరో తీవ్ర విషాదకర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

వరుస విషాదాలు
టాలీవుడ్ లో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో మరణించగా ఆయన మరణ వార్త మరువక ముందే టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మరణించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ లీడింగ్ యాంకర్ అనసూయ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

అలా కెరీర్ మొదలు పెట్టి
అనసూయ ముందుగా ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత ఎంటర్ టైన్ మెంట్ యాంకర్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది..జబర్దస్త్ షోలో యాంకర్ అయ్యాక ఆమె బాగా క్రేజ్ సంపాదించింది..ఆ ఒక్క షో ద్వారా ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించడమే కాక యూత్ లో కూడా ఫాలోయింగ్ సంపాదించింది. అలాంటి ఆమె ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది.

తీవ్ర విషాదం
టాలీవుడ్ యాంకర్, నటిగా పలు సినిమాల్లో కీలక పాత్రలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన తార్నాకలోని తమ నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారని తెలుస్తోంది.

ప్రగాఢ సానుభూతి
ఇక తన బ్యాచ్ మేట్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ ఎప్పుడూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని చెబుతూ ఉండేది. అయితే తన తండ్రి దూరం కావడంతో ప్రస్తుతం అనసూయ కుటుంబం అంతా శోకం సంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
Recommended Video

ప్రేమ పెళ్ళి
అనసూయ తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త కాగా ఆయన కాంగ్రెస్ లో ఆక్టివ్ గా ఉండేవారు. ఆయన తన తల్లి పేరునే కుమార్తె అనసూయకు కూడా పెట్టుకున్నాడు. అనసూయను ఆర్మీకి పంపాలని అనుకున్నారట. కానీ అనసూయ మాత్రం ముందు మీడియా ఆ తరువాత అనుకోకుండా సినిమా రంగం వైపు మళ్లింది. అయితే అనసూయ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఆమెను తొలుత ఇంట్లో వాళ్ల నుంచి సపోర్ట్ లభించలేదు అని, చాలా కాలం తరువాత ఒప్పుకున్నారు అని అనసూయ గతంలో వెల్లడించింది.

సినిమాల విషయానికొస్తే
నటన మీద ఆసక్తితో ఒక పక్క షోలకు యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తోంది..రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఆ తరువాత పలు సినిమాల్లో నటనతోనూ అందరిని మెప్పించిన అనసూయ. ప్రస్తుత "పుష్ప" సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె దాక్షాయణి అనే పాత్రలో సునీల్ కి భార్యగా నటిస్తోంది.