»   » నేనెక్కడున్నాను?: కొడుకు వేసిన బొమ్మతో ప్రేక్షకులకి టెస్ట్ పెట్టిన అనసూయ

నేనెక్కడున్నాను?: కొడుకు వేసిన బొమ్మతో ప్రేక్షకులకి టెస్ట్ పెట్టిన అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు యాంకర్లలో సుమ తర్వాత అంత పేరు తెచ్చుకుంది అనసూయే. సుమ తన మాటకారితనంతో అందరి మెప్పు పొందింది. యాంకర్ కు గ్లామర్ లుక్ తెచ్చింది మాత్రం అనసూయే. అందంతోపాటు అట్రాక్షన్ కూడా పుష్కలంగా ఉండటంతో టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. క్షణం సినిమాలో ఓ నెగిటివ్ రోల్ చేసి తనలో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా స్టార్ హీరోయిన్లకున్నంత ఫాలోయింగ్ ఉంది ఆమెకు.

సినిమా రంగంలో రాణించాలంటే కేవలం అందం ఉంటే పోదు... తమ అందాలను ఎలాంటి మొహమాటం లేకుండా కెమెరా ముందు ఫోజులు ఇచ్చే ధైర్యం కూడా కావాలి. దీనికి తోడు కాస్త చలాకీతనం, నటనతో మెప్పించే టాలెంట్ ఉంటే చాలు. ఇలాంటి లక్షణాలన్నీ మొండుగా ఉన్న అనసూయ ప్రస్తుతం తనదైన స్ట్రాటజీతో దూసుకెలుతోంది.

Anchor Anasuya instagram post gone viral

అనసూయ ప్రతీపోస్ట్ కీ, ప్రతీ లైవ్ వీడియోకీ అభిమానుల రెస్పాన్స్ వరదలాగా ముంచెత్తుతుంది. బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పుడు అనసూయ కూడా ఒక న్యూస్ టాపిక్. ఏవార్తా లేకపోతే ఒక రూమర్ సృష్టించైనా ఆమెని వార్తల్లోకి తెస్తూనే ఉన్నాయి వెబ్సైట్లూ, చానెళ్ళూ. ఇక సోషల్ మీడియాలోనూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది అనసూయ. ఇదిగో ఆమె పెట్టిన లేటెస్ట్ పోస్ట్ కి వచ్చిన రెస్పాన్స్ చూడండీ.... ఇంతకీ ఆ పోస్టేమిటీ అంటే...

త‌న పెద్ద కుమారుడు త‌మ ఫ్యామిలీ బొమ్మ‌లు వేశాడ‌ని, అందులో తాను ఎక్క‌డున్నానో చెప్పుకోండ‌ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. 'క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఎడ‌మ‌ ప‌క్క‌న ఉన్న‌ది నువ్వే అన‌సూయ' అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అల‌రిస్తోన్న అన‌సూయ పెద్దకుమారుడి బొమ్మ‌ల‌ని మీరూ చూడండి..

English summary
Anchor Anasuya posted a Drawing by her son and says "Guess who am I in this art by my peddodu"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu