»   » నేనుంటనే ఓ కిక్కు.. ఇంకా అదేందుకు.. అనసూయ పంచ్‌లతో బేజార్

నేనుంటనే ఓ కిక్కు.. ఇంకా అదేందుకు.. అనసూయ పంచ్‌లతో బేజార్

Written By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ షోలో పంచ్‌లు వేయడంలో టాప్ యాంకర్ అనసూయకు ఎదురే ఉండదు. మాటల గారడీ, ఎక్స్‌ప్రెషన్స్ అమెను యాంకర్లలలో నంబర్‌వన్ స్థానానికి చేరుకునేలా చేశాయి.

Anasuya

టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తున్న అనసూయకు సినీ అవవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అనసూయకు ఉన్న గ్లామర్ అలాంటింది. ఇటీవల అనసూయ వేసిన పంచ్ డైలాగ్ చర్చనీయాంశమైంది.

దిమ్మ తిరిగేలా సమాధానం..

దిమ్మ తిరిగేలా సమాధానం..

తాజాగా ఇటీవల టెలివిజన్ షో ఓ ఆడియన్ అడిగిన ప్రశ్నకు అనసూయ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది. కిక్కు కోసం లిక్కర్‌ను ఆఫర్ చేస్తావా అని అనసూయను ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. అందుకు సమాధానంగా కిక్కు ఎక్కడానికి నేను ఉంటే చాలు అని షాకింగ్ సమాధానమివ్వడంతో షోలో ఉన్నవారు తేరుకోలేకపోయారు.

డబుల్ మీనింగ్స్‌తో ..

డబుల్ మీనింగ్స్‌తో ..

కేవలం యాంకర్ అనసూయకే ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పరిమితం కాలేదు. జబర్దస్థ్, ఎక్స్‌ట్రా జబర్దస్థ్, పటాస్, ఈ జంక్షన్ లాంటి కార్యక్రమాలు డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో దద్దరిల్లుతున్నాయి.

హోస్ట్‌లు, గెస్టులు రెచ్చిపోయి..

హోస్ట్‌లు, గెస్టులు రెచ్చిపోయి..

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే పటాస్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులు, యాంకర్లు, హోస్ట్‌లు, గెస్ట్‌లు రెచ్చిపోతున్నారు. ‘గడ్డపార దిగుతది.. జెరా మెల్లగా' లాంటి డైలాగ్స్ హోరెత్తిస్తున్నాయి.

అవి తప్పా ఎంటర్‌టైన్‌మెంట్ లేదా..

అవి తప్పా ఎంటర్‌టైన్‌మెంట్ లేదా..

ఇక టెలివిజన్ రంగంలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కాలు తప్ప కుటుంబ సమేతంగా చూసే కార్యక్రమం మచ్చుకు కనబడటం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

English summary
These days all the entertainment channels are promoting double meaning content. Top Anchor Anasuya stunned the Audience with like "I am not enough for getting a kick.”. This kind of dailogues are not restricted to single channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu