Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఫిదా పాటకు అనసూయ డ్యాన్స్ కేక.. పెళ్లి వేడుకలో మరింత మసాలా!
Recommended Video
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఇళ్లంతా పెళ్లి వాతావరణంతో కళకళలాడుతున్నది. ఇంట్లోకి యాంకర్ అనసూయ రాకతో ఇంటి సభ్యుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అందంగా ముస్తాబైన ఇంటి సభ్యులు పెళ్లి పాటలతో హంగామా చేశారు. ఈ టాస్క్‌లో అనసూయ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో కేక పుట్టిస్తున్నది. వివరాల్లోకి వెళితే..
యాంకర్ అనసూయ హంగామా
మంగళవారం జరిగిన ఎపిసోడ్లో యాంకర్ అనసూయ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచింది. ఇంటి సభ్యులతో కలిసి పెళ్లి వేడుకలో భాగమైంది. బుధవారం జరిగే పెళ్లి వేడుకలో అనసూయ హంగామా రచ్చగా మారింది.
ఫిదా పాటకు రంగమ్మత్త స్టెప్పులు
ఫిదా చిత్రంలోని పిల్లాడొచ్చాడే పాటకు అనసూయ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. అనసూయతో కలిసి సెలబ్రిటీలందరూ ఇంట్లో కాకపుట్టించారు. ఎపిసోడ్‌ను నిజంగా పెళ్లి జరుగుతుందా అనే అంతగా వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
కౌశల్, దీప్తి రొమాంటిక్‌గా
కౌశల్, దీప్తి నల్లమోతు కలిసి వేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఆసక్తికరంగా మారింది. గణేష్ సెప్పులతో ఊపు తెచ్చాడు. అమిత్, తనీష్ అమ్మాయిలతో కలిసి హడావిడి సృష్టించారు. ప్రతీ ఇంటి సభ్యుడు అందంగా ముస్తాబై పెళ్లి వేడుకలో భాగమవ్వడం విశేషం.
|
మరింత మసాలాతో బిగ్‌బాస్
బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకు మరింత మసాలా యాడ్ చేసినట్టు కనిపిస్తున్నది. ప్రోమోలోని విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అనసూయ ప్రత్యేక ఆకర్షణగా మారి ఈ ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.