»   » రవితో విభేదాలు నిజమే.. ఆయనతో ఏడేండ్ల అఫైర్.. లాస్య

రవితో విభేదాలు నిజమే.. ఆయనతో ఏడేండ్ల అఫైర్.. లాస్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెరపై యాంకర్ రవితో ఉన్న సంబంధాల గురించి యాంకర్ లాస్య వివరణ ఇచ్చింది. ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్న అంశంపై ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. యాంకర్లు రవి, లాస్య యాంకర్ల జోడీకి బుల్లితెర మీద మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెకు ఎంగేజ్‌మెంట్ మంజునాథ్ అనే వ్యాపారవేత్తతో జరిగింది.

లాస్య ఎంగేజ్మెంట్ ఫోటోలు

యాంకర్ రవితో విభేదాలు నిజమే..

యాంకర్ రవితో విభేదాలు నిజమే..

‘ఇటీవల రవితో విభేదాలు నెలకొన్నావన్న మాట నిజమే. సక్సెస్ తర్వాత ఇగో ప్రాబ్లెమ్స్ అందరిలోనూ వస్తుంటాయి. అలాగే మా మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. రవికి, నాకు మధ్య అఫైర్ ఉందనే రూమర్ మీడియాలో విస్త్రతంగా ప్రచారమైంది. ఆ పుకార్లు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేసింది' అని లాస్య వివరించింది.

రవి అదేదో ఫీలింగ్‌తో ఉండేవాడు.

రవి అదేదో ఫీలింగ్‌తో ఉండేవాడు.

'రవి నాకేదో జీవితాన్ని ప్రసాదించాడనే ఫీలింగ్‌తో ఉండేవాడు. ఆయన ప్రవర్తన చాలా ఇబ్బంది పెట్టింది. ఆ కారణంగానే రవితో కలిసి యాంకరింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇక ముందు కూడా అతనితో కలిసి పనిచేయను'

మంజునాథ్‌తో ఏడేండ్లుగా అఫైర్

మంజునాథ్‌తో ఏడేండ్లుగా అఫైర్

‘నా కాబోయే భర్త మంజునాథ్‌తో ఏడేండ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. జీవితంలో స్థిరపడిన తర్వాత పెండ్లి చేసుకొందామని నిర్ణయించుకొన్నాం. అందుకే అన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్న తర్వాత యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చాను. పెళ్లి తర్వాత మళ్లీ త్వరలోనే యాంకరింగ్ చేస్తాను' అని ఆమె వెల్లడించారు.

రవి, లాస్య జోడికి మంచి ఫాలోయింగ్

రవి, లాస్య జోడికి మంచి ఫాలోయింగ్

బుల్లితెర మీద హుందాతనమైన వస్త్రధారణతో కనిపించిన యాంకర్‌ లాస్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. యాంకర్‌ రవితో కలిసి చేసిన ప్రోగ్రామ్స్ మంచి సక్సెస్‌ను సాధించాయి. వారిద్దరి జోడీకి టెలివిజన్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

English summary
Anchor Lasya engagement happend with businessmen Manjunath. In this occassion Lasya denies Affair with Anchor Ravi and clarified relation with Ravi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu