బిగ్ బాస్ 3లో ఛాన్స్, రూ. 30 లక్షలు రెమ్యూనరేషన్... యాంకర్ లాస్య రియాక్షన్ ఇదీ!

Recommended Video

Bigg Boss Telugu 3 : Anchor Lasya Clarifies On Bigg Boss 3 Participation

తెలుగులో సూపర్ హిట్ అయిన 'బిగ్ బాస్' రియాల్టీ షో త్వరలో 3వ సీజన్లోకి ఎంటరవ్వబోతోంది. జులై మూడోవారంలో ప్రారంభం కాబోతున్న ఈ షో కోసం ఆల్రెడీ తెర వెనక కసరత్తు జరుగుతోంది. తొలి సీజన్ జూ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా.... మూడో సీజన్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరో వైపు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటి వరకు షో నిర్వాహకులు ఎవరి పేరు అఫీషియల్‌గా ప్రకటించక పోయినా... సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన పేరు యాంకర్ లాస్య.

యాంకర్ లాస్య రీ ఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారం

యాంకర్ లాస్య రీ ఎంట్రీ ఇస్తుందంటూ ప్రచారం

తెలుగు పాపులర్ యాంకర్లలో ఒకరైన లాస్య... మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లాడటం, ఆపై గర్భం దాల్చడం తెలిసిందే. రెండున్నర నెలల క్రితమే ఆమె మగ బిడ్డకు జన్మినిచ్చింది. బిగ్ బాస్ 3 ద్వారా లాస్య టెలివిజన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది.

బిగ్ బాస్ 3, రూ. 30 లక్షలు... వార్తలపై స్పందించిన లాస్య

బిగ్ బాస్ 3, రూ. 30 లక్షలు... వార్తలపై స్పందించిన లాస్య

‘‘నేను బిగ్ బాస్ షోకు సెలక్ట్ అయ్యానని, షో ప్రారంభానికి ముందే రూ. 30 లక్షలు ఇచ్చేశారు అంటూ వస్తున్న వార్తలు వినడానికి చాలా బావున్నాయి. కానీ ఇదంతా అబద్దం. ఇది ఫేక్ న్యూస్ మాత్రమే. ఈ ఫేక్ న్యూస్ ఇప్పటికే చాలా స్ప్రెడ్ అయింది.'' అని యాంకర్ లాస్య తెలిపారు.

నాకు చిన్న బాబు ఉన్నాడు, చేసే ఉద్దేశ్యం లేదు

నాకు చిన్న బాబు ఉన్నాడు, చేసే ఉద్దేశ్యం లేదు

ఈ వార్తలు చూసి నా సన్నిహితులు, ఫ్రెండ్స్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. అందరూ ఈ ఫేక్ న్యూస్ నమ్మేస్తుండటంతో స్పందించక తప్పడం లేదు. నాకు రెండున్నర నెలల చిన్న బాబు ఉన్నాడు. వాడితోనే సమయం సరిపోతుంది. ఈ టైం నాకు మళ్లీ మళ్లీ రాదు. సంవత్సరం వరకు వాడితోనే టైమ్ స్పెండ్ చేయాలి. ఈ సారి అయితే బిగ్ బాస్ షో చేసే ఆలోచన లేదు. నెక్ట్స్ టైమ్ అవకాశం వస్తే చూద్దాం... అంటూ లాస్య స్పష్టం చేశారు.

మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న హడావుడి

మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న హడావుడి

‘బిగ్ బాస్ తెలుగు 3' హడావుడి మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే స్టార్ మా టీవీ వారు ఈ కార్యక్రమానికి సంబంధించిన అఫీషియల్ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. షో హోస్ట్‌గా నాగార్జున ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ప్రస్తుతం ఆయనపై ప్రోమోల చిత్రీకరణ జరుగుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X