Don't Miss!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- News
విశాఖ నుంచి పాలన - మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..!!
- Finance
Stock Market: సందిగ్ధంలో దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొన్ని లాభాల్లో మరికొన్ని నష్టాల్లో..
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
షాకిచ్చిన యాంకర్ మంజుష.. ఖరీదైన కారుతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో టాప్ యాంకర్లలో మంజుషా ఒకరు. స్టేజ్ ఎక్కారంటే మాటలతో దడదడలాడిస్తుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ సినిమా కార్యక్రమానికైనా తన మాటల పదనుతో క్రేజ్ తెప్పిస్తుంటారు. ఇలా యాంకరింగ్ దూసుకెళ్తున్న మంజుషా తాజాగా తన డ్రీమ్‌ను పూర్తి చేసుకొన్నారు. ఎన్నో రోజలు కలను సాకారం చేసుకొన్నానని సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌తో ఆకట్టుకొన్నారు. ఎంతకు ఆమె సాకారమైన కల ఏమిటంటే..

బీఎండబ్ల్యూ కారుతో
వాహనాల్లో రారాజు బీఎండబ్ల్యూ కొనాలని ఎవరికి ఉండదు. అలాంటి కోరుకొంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడమనేది కష్టమే. కానీ యాంకర్ మంజుష తన కోరికను పూర్తిగా కానిచ్చారు. తాను బీఎండబ్ల్యూ కారు కొన్నట్టు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

కారు కొన్నాననే విషయం..
నాకు డ్రీమ్ కారు కొన్నాననే విషయాన్ని ఇంకా నమ్మబుద్ది కావడం లేదు. భగవంతుడి దయవల్లనే సాధ్యమైందని నమ్ముతాను. బిఎండబ్ల్యూ కారు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం అని ఫేస్‌బుక్‌లో తన సంతోషాన్ని సందేశం రూపంలో వ్యక్తం చేశారు.

తన టాలెంట్‌తో
యాంకర్ మంజుషా తన వాగ్దాటితో ఎంతో మంది సినీ ప్రముఖులను ఆకట్టుకొన్నారు. వేదికలపై పలు సందర్భాల్లో సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ... మూవీ గురించి చెప్పి క్రేజ్ పెంచడంలో సక్సెస్ అయ్యావు అంటూ పలువురు ప్రశంసలు అందించిన సందర్భాల్లో ఎన్నో. అలాంటి ప్రతిభవంతురాలైన మంజుష తనకు ఇష్టమైన కారు కొనాలనే కలను సాకారం చేసుకోవడంపై నెటిజన్ల అభినందిస్తున్నారు.

సైరా, సాహో ప్రమోషన్లలో
ఇటీవల సైరా, సాహో ప్రమోషన్స్‌లో భాగంగా మంజుష చేసిన ఇంటర్వ్యూలు నెటిజన్లను, సినీ అభిమానులను విశేషంగా ఆకర్షించాయి. తన ప్రతిభతో అభిమానులను సంతృప్తి పరిచే విధంగా సినిమా విశేషాలను రాబట్టడానికి ప్రయత్నించడం ఆకట్టుకొంటున్నది. అలాంటి టాలెంటెడ్ మంజుష ఇంకెన్నో విశేషాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు.