Just In
- 32 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొదటి సారిగా ప్రదీప్‌కు పంచ్.. అందరి ముందు అలా అనేసి గాలి తీసిన సింగర్
బుల్లితెరపై యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్‌లకు రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఎవ్వరి వల్లా కాదు. అలాంటి యాంకర్ ప్రదీప్‌కే ఓ యువ సింగర్ పంచ్ వేసింది. ఆ దెబ్బకు యాంకర్ ప్రదీప్‌కు బాగానే మండినట్టుంది. తిరిగి రివర్స్‌లో పంచ్ వేశాడు. అలా మొత్తానికి యాంకర్ ప్రదీప్‌కు మొదటి సారిగా పంచ్ పడింది. ఇదంతా జరిగింది సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ షోలో. ప్రతీవారం షోలో సింగర్ల కంటే యాంకర్ వేసే పంచ్‌లు, చేసే కామెడీనే వైరల్ అవుతూఉంటుంది.

ప్రతీ షోలోనూ అంతే..
మామూలుగా బుల్లితెరపై షో అంటే ఇప్పుడు కొన్ని ఫార్మూలాను వాడుతున్నారు. ఏదైనా లవ్ ట్రాకులు నడపాలి.. లేదంటే కుళ్లు జోకులు వేస్తూ షోను ముందుకు తీసుకెళ్లాలి. అది డ్యాన్స్ షో అయినా సరే పాటలు పాడే పద్దతైన షో అయినా సరే. ట్రాకులు, కుళ్లు కామెడీ మాత్రం కంపల్సరీ అనేట్టుగా మారింది.

సరిగమపలో..
సరిగమప షోలో యాంకర్ ప్రదీప్ హారిక నారాయణ్ మధ్య లవ్ ట్రాక్‌ను బాగానే క్రియేట్ చేశారు. ప్రోమోలు, ఎడిటింగ్ మాయాజాలంతో ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు భ్రమను కలిగిస్తున్నారు. వాటికి తగ్గట్టు హారిక, ప్రదీప్‌లు కూడా రెచ్చిపోతున్నారు. ఈ ట్రాక్ వల్లే హారిక ఇంతగా పాపులర్ అయింది.

యశస్వీ వల్లే..
యశస్వీ కొండెపూడి అనే సింగర్ వల్లే షో మరింత పాపులర్ అయింది. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా ఆలపించిన యశస్వీ ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అప్పటినుంచి అతని కోసమే షోను చూసే వాళ్లెంతో మంది అభిమానులుగా తయారయ్యారు..

ఆ సింగర్‌పై..
ఆ గ్రూపులో యుతి అనే ఓ సింగర్ ఉంది. ఆమెకు సంగీతంపై మంచి పట్టు ఉంది. కానీ జనరల్ నాలెడ్జ్‌పై అంతగా పట్టు లేదు. దాన్ని ఆసరగా తీసుకున్న ప్రదీప్.. ఆమెపై కుళ్లు జోకులు వేశాడు. హైద్రాబాద్‌లో బీచ్ ఎక్కడుంది.. ఏ నది ఉంది.. చార్మినార్‌కు ఎన్ని మినార్‌లున్నాయని అడుగుతూ గాలి తీసేశాడు గత వారంలో.

తాజాగా అలా..
ప్రస్తుతం ఈ షోలో ఎలిమినేషన్ రౌండ్స్ నడుస్తున్నాయి.. అందులో భాగంగా ప్రదీప్ మాట్లాడుతూ.. సూపర్ 6లో ఎంత మంది ఉంటారో తెలుసా? అని అంటాడు. వెంటనే యుతి అందుకుని సూపర్ 6 అంటే ఆరు మందేఉంటారని కౌంటర్ వేసింది. దీంతో ప్రదీప్‌కు ఎక్కడో కాలిపోయింది. అందుకే నాగార్జున్ సాగర్ డ్యాం అంటూ గత వారంలో యుతి చెప్పిన వాటిని గెలికాడు.