For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లిపై తొలిసారి పెదవి విప్పిన ప్రదీప్: ఎప్పుడో చెప్పిన యాంకర్.. అమ్మాయి గురించి కూడా!

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ అండ్ టాలెంటెండ్ గాయ్ ప్రదీప్ మాచిరాజు. రేడీయో జాకీగా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో యాంకరింగ్‌లో తనదైన ముద్రను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నాడు. అంతేకాదు, సినిమాల్లోనూ సందడి చేస్తోన్న ప్రదీప్.. గత ఏడాది హీరోగా భారీ హిట్‌ను కొట్టాడు. ఇదిలా ఉండగా.. ఈ స్టార్ యాంకర్ పెళ్లిపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ దీనిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఆ వివరాలు మీకోసం!

  అలా ఎంట్రీ.. ఫుల్ పాపులారిటీ

  అలా ఎంట్రీ.. ఫుల్ పాపులారిటీ

  యాంకర్‌ అవడానికి ముందే ప్రదీప్ రేడియో జాకీగా కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత బుల్లితెరపైకి ప్రవేశించాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. ఇక, 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును కూడా తీసుకున్నాడు.

  మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: వామ్మో ఇలా చూపిస్తుందేంటి!

  ప్రదీప్ సక్సెస్‌కు కారణం ఇదే

  ప్రదీప్ సక్సెస్‌కు కారణం ఇదే

  బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకడు. అతడు ఈ స్థాయికి ఎదిగి.. అదే రేంజ్‌ను కంటిన్యూ చేస్తూ వెళ్లడానికి ప్రధాన కారణం టైమింగే అని చెప్పుకోవచ్చు. తనదైన వాక్చాతుర్యంతో సందడి చేసే ఈ కుర్రాడు.. అప్పటికప్పుడు పంచులు వేస్తూ తెగ సందడి చేస్తుంటాడు. అందుకే ప్రదీప్ ఏ షో చేస్తే అది సూపర్ డూపర్ హిట్ అవుతూనే ఉంటోంది.

  సినిమాల్లోనూ.. హీరోగా సక్సెస్

  సినిమాల్లోనూ.. హీరోగా సక్సెస్


  తనదైన హోస్టింగ్‌తో బుల్లితెరపై హవాను చూపిస్తోన్న ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే వెండితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా మారాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో భారీ హిట్ కొట్టేసింది.

  Thank You Twitter Review: చైతన్య మూవీకి షాకింగ్ టాక్.. అదే తేడా కొట్టిందట.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  బుల్లితెరపై హవా చూపిస్తూనే

  బుల్లితెరపై హవా చూపిస్తూనే

  ప్రదీప్ మాచిరాజు యాంకర్‌గా మారిన తర్వాత నుంచి ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 14', 'జీ సూపర్ ఫ్యామిలీ' సహా పలు షోలు, ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తున్నాడు. అలాగే, సినిమాలనూ చేస్తున్నాడు.

  ప్రదీప్ మ్యారేజ్ హాట్ టాపిక్

  ప్రదీప్ మ్యారేజ్ హాట్ టాపిక్

  తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై ప్రదీప్ కూడా పలుమార్లు స్పందిస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పేశాడు.

  శృతి మించిన అనన్య అందాల ఆరబోత: వామ్మో ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తే!

  పెళ్లిపై పెదవి విప్పిన ప్రదీప్

  తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'జీ సూపర్ ఫ్యామిలీ' షోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగానే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం 'ప్రేమ ఎంత మధురం', 'అగ్నిసాక్షి' సీరియల్ టీమ్‌లు వచ్చాయి. వీళ్లతో ఆట ఆడుతోన్న సమయంలో పెళ్లి, భార్యల గురించి పలువురు కామెంట్లు చేశారు. దీంతో యాంకర్ ప్రదీప్ ఐదారేళ్లలో పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు.

  అమలాపురం నుంచి లైన్‌లో

  అమలాపురం నుంచి లైన్‌లో

  ఈ షోలో భాగంగా అప్పటి వరకూ జరిగిన టాపిక్‌లను ఉద్దేశిస్తూ ప్రదీప్ 'ఇంక చూడు.. ఈ విషయాలతో మొదలు పెడతాను. ఒక ఐదారేళ్లలో పెళ్లి చేసుకుంటాను' అని చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే ఉన్న ఒకరు 'నీకోసం అమలాపురం నుంచి లైన్ ఉంది' అని చెప్పారు. దీంతో ప్రదీప్ ఒక్కసారిగా షాకై 'ఏంటి.. మన అమలాపురం నుంచేనా' అని అడిగి నవ్వులు పూయించాడు.

  English summary
  Anchor Pradeep Machiraju Now Doing ZEE Super Family Show. Recently He Did Comments on His Marriage in an Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X