Don't Miss!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- News
AP DGP Twitter : ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో బూతు బొమ్మలు- డీఐజీ వార్నింగ్..
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
పెళ్లిపై నోరు విప్పిన యాంకర్ ప్రదీప్: ఆ షోలోకి ఆమెతో కలిసి.. దానికి బాగా మోజు అంటూ!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్నాడు ప్రదీప్ మాచిరాజు. సాదాసీదాగానే కెరీర్‌ను ఆరంభించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో యాంకరింగ్‌లో తనదైన ముద్రను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నాడు. ఈ స్టార్ యాంకర్ పెళ్లిపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ దీనిపై ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

అలా వచ్చి.. టాప్ యాంకర్‌గా
ప్రదీప్ రేడియో జాకీగా కెరీర్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బుల్లితెరపైకి యాంకర్‌గా ప్రవేశించాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. ఇక, 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. ఏకంగా దీనితో నంది అవార్డును అందుకున్నాడు.
సీతా రామం హీరోయిన్ అందాల విందు: క్లీవేజ్ షోతో టెంప్ట్ చేస్తోన్న బ్యూటీ

మూవీల్లోనూ.. హీరోగా విజయం
అదిరిపోయే యాంకరింగ్‌తో బుల్లితెరపై హవాను చూపిస్తోన్న ప్రదీప్ మాచిరాజు.. కొన్నేళ్ల క్రితమే వెండితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా మారాడు. క్రేజీగా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ హిట్‌గా నిలిచింది.

బుల్లితెరపై వరుస షోలతోనే
యాంకర్‌గా మారిన తర్వాత నుంచి ప్రదీప్ మాచిరాజు ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఇందులో చాలా వరకూ సూపర్ హిట్ అయినవే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు 'ఢీ 15', 'జీ సూపర్ ఫ్యామిలీ', 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' సహా పలు షోలు, ఈవెంట్లు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్నాడు.
బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

ప్రదీప్ పెళ్లి న్యూస్ హైలైట్
బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై ప్రదీప్ కూడా పలుమార్లు స్పందిస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చాడు.

నవ్యతో పెళ్లి అని ప్రచారం
చాలా కాలం నుంచి యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవలే అతడు ప్రముఖ స్టైలిస్ట్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఆమె గానీ, ప్రదీప్ కానీ స్పందించలేదు. దీంతో ఇది నిజమేనని అందరూ అనుకుంటోన్నారు. ఫలితంగా ఈ న్యూస్ ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!
పెళ్లిపై ప్రశ్న.. షాకయ్యాను
తాజాగా యాంకర్ ప్రదీప్ 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' షోలో పాల్గొన్నాడు. దీనికి గెస్టుగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె 'నాలుగైదు రోజులుగా ఏదో న్యూస్ వింటున్నాను. ప్రదీప్ మాచిరాజు చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా' అని ఆయన అన్నారు. దీంతో వెంటనే ప్రదీప్ 'ఆ అమ్మాయి ఎవరో చూస్తే నేను కూడా షాక్ అవుతాను సార్' అంటూ ఆ వార్తలను ఖండించాడు.

మీడియాకు బాగా మోజని
పెళ్లి వార్తలను ప్రదీప్ ఖండించిన వెంటనే ఆ షోలో 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్‌కు మాచిరాజు.. నువ్వు జోడీగా రావాలోయ్ ఏదో రోజు.. కొంచెం టచ్‌లో ఉంటావా మాచిరాజూ.. నువ్వంటే మీడియాకు బాగా మోజు' అంటూ బంగార్రాజు సినిమాలోని పాటను పేరడీ చేసి పాడించి ప్లే చేశారు. మొత్తానికి ప్రదీప్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఇలా పుల్‌స్టాప్ వేసే ప్రయత్నం చేశాడు.