Just In
- 36 min ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 56 min ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 1 hr ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 2 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
ఫ్రాన్స్‌లో పెను సంచలనం -మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి జైలు శిక్ష
- Sports
ఆల్‌టైమ్ గ్రేట్ క్యాచ్.. 46 ఏళ్ల వయసులోనూ సూపర్ డైవ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో
- Finance
9 ఏళ్ల గరిష్టానికి టాటా మోటార్స్ సేల్స్, వాహనాల సేల్స్ భారీగా జంప్
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుమకు తలనొప్పిగా మారిన సుధీర్ ఫాలోయింగ్.. గుట్టువిప్పిన యాంకర్ రవి
ఒక్కోసారి ఒక్కో సెలెబ్రిటీ ఫాలోయింగ్ ఇంకొందరు ఇబ్బందిగా మారుతుంది. అలా సుధీర్ ఫాలోయింగ్ క్రేజ్ సుమకు డిస్టర్బెన్స్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో సుమ నేరుగా తన షోలో సుధీర్ ఫాలోయింగ్ గురించి కామెంట్ చేసింది. అంతే కాకుండా సుమ తన యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు చేస్తూ ఉంటే కూడా కామెంట్లలో సుధీర్ ఫ్యాన్స్ హంగామానే కనిపిస్తోందట. ఆ మధ్య కామెంట్ల మీద సుమ చేసిన స్పెషల్ వీడియోలో చెప్పుకొచ్చింది.

క్యాష్ షోలో అలా..
ఆ మధ్య సుమ ఓ సారి క్యాష్ షోలో సుధీర్ గురించి అతడి ఫ్యాన్స్ గురించి కామెంట్లు చేసింది. ఏదో ఫన్నీ క్వశ్చన్ అడగడం.. బ్యాక్ గ్రౌండ్ నుంచి మేం సుధీర్ అన్న ఫ్యాన్స్ అంటూ డైలాగ్‌లు రావడంతో.. సుమ వెరైటీగా పంచ్‌లు వేసింది. సుధీర్ ఫ్యాన్స్ అయితే వెళ్లి ఆ షోలో రచ్చ చేయండి.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కౌంటర్ వేసింది.

సుమ కూడా అలానే..
ఇక సుమ తన ఈట్ టాక్ షోలో సుధీర్‌ను గెస్ట్‌గా పిలిచింది. అయితే సుధీర్ సుమ కలిసి చేసిన వీడియోనే అతి తక్కువ సమయంలో మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. దానికి కారణం సుధీర్ క్రేజే అంటూ కామెంట్లు వచ్చాయని సుమ చదివింది. చివరకు సుమ కూడా జై సుధీర్ అన్న అంటూ నినాదం చేసింది.

తాజాగా ఇలా..
అయితే తాజాగా ఇదే విషయంపై యాంకర్ రవి, సుమ వాగ్వాదం చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో రవి, సుమలు వేసే పంచ్‌లు బాగానే పేలుతున్నాయి. వచ్చే వారం రాబోతోన్న షోకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో సుమ గురించి రవి మాట్లాడుతూ సుధీర్ ఫ్యాన్స్ గురించి కామెంట్ చేశాడు.

ఆ కామెంట్లు పెట్టేది..
ఆ షోలో సీరియల్ హీరో పవన్, తనూజలు గెస్ట్‌లుగా వచ్చారు. వారి గురించి మాట్లాడుతూ మీ వీడియో కింద 500 కామెంట్లు పెట్టినా కూడా చూడటం లేదంటూ రవి వాపోయాడు. అంటే నా వీడియో కింద కామెంట్లు పెట్టేది నువ్వేనా? అంటూ రవిపై సుమ కౌంటర్ వేసింది. అవును మీ వీడియోల కింద జై సుధీర్ అంటూ కామెంట్ పెట్టేది నేనే అంటూ సుమపై రవి రివర్స్ కౌంటర్ వేశాడు. అలా మొత్తానికి సుధీర్ ఫాలోయింగ్ మాత్రం ప్రతీసారి హాట్ టాపిక్ అవుతోంది.