twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss లో తెలంగాణ వారికి అన్యాయం.. యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత తెలంగాణ జాగృతి ఆగ్రహం

    |

    బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో వివాదంలో కూరుకుపోయింది. 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత తెలంగాణవాదులే కాకుండా అభిమానులు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే యాంకర్ రవి ఎలిమినేషన్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. అయితే ఈ వివాద వివరాల్లోకి వెళితే..

    నాటకీయ పరిణామాల మధ్య

    నాటకీయ పరిణామాల మధ్య


    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో యాంకర్ రవి, ఆర్జే కాజల్ మిగిలిపోయారు. దాంతో టాప్ కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఉత్కంఠను రేపింది. అయితే అదే సమయంలో వారిద్దరిలో ఒకరిని సేఫ్ చేసే బాధ్యత ఎవిక్షన్ పాస్ ఉన్న వీజే సన్నీకి మాత్రమే ఉంది. కాబట్టి ఆ పాస్‌ను తన స్వంతానికి ఉపయోగించుకొంటారో లేదా మరొకిరిని సేవ్ చేస్తాడో ఆలోచించుకోమని హోస్ట్ నాగార్జున చెప్పారు.

    ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో వీజే సన్నీ

    ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో వీజే సన్నీ

    అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తనకు తన తల్లి ఇచ్చింది. అయితే తాను కాజోల్‌కు ఇవ్వాలని అనుకొంటున్నాను అని వీజే సన్నీ చెప్పాడు. అయితే నీ చేతిలో ఉన్న పాస్‌ ఒక్కసారి ఎవరికైనా ఇస్తే.. వారు తనకు అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేయకూడదు. ఒక్కసారి ఆ పాస్‌ను ఉపయోగించుకొన్న తర్వాత దానిని మళ్లీ వెనకకు తీసుకోనే అవకాశం ఉండదు అని నాగార్జున గేమ్ రూల్స్ చెప్పాడు. దాంతో ఆ పాస్‌ను తీసుకెళ్లి కాజల్ కాళ్ల ముందు పెట్టి ఎవిక్షన్ పాస్‌ను వీజే సన్నీ ఉపయోగించుకొన్నాడు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు.

    అనూహ్య పరిస్థితుల్లో రవి ఎలిమినేట్

    అనూహ్య పరిస్థితుల్లో రవి ఎలిమినేట్

    అనూహ్య పరిస్థితుల్లో ఇంటి నుంచి యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. ఎలిమినేషన్ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అభిమానులు, తెలంగాణవాదులు భారీగా బిగ్‌బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు, ఆ సంస్థ రంగారెడడ్ి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ ధర్నా చేశారు.

    తెలంగాణ జాగృతి ఆగ్రహం

    తెలంగాణ జాగృతి ఆగ్రహం

    అయితే బిగ్‌బాస్ హౌస్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతున్నది. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో వాటి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ షోకు వ్యతిరేకంగా నవీన్ గౌడ్ నినాదాలు చేశారు. యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత ఆయన అభిమానులు కూడా అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Anchor Ravi పై కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్!! || Filmibeat Telugu
    ఇంటిలో ఇంకా ఏడుగురు

    ఇంటిలో ఇంకా ఏడుగురు


    ఇక యాంకర్ రవి ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో మొత్తం 7 మంది సభ్యులు ఉన్నారు. వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సింగర్ శ్రీరామచంద్ర, సిరి హన్మంతు, మానస్, ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్ ఉన్నారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 5 షో ముగియడానికి ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి.

    English summary
    Bigg Boss Telugu 5 Contestant, Anchor Ravi Elimination goes contraversy. In this occassion, Telangana Jagruthi alleges on Bigg Boss Telugu 5 Show
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X