For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కిన యాంకర్ రవి.. రూ.41 లక్షలు మోసం చేశాడని కేసు నమోదు.!

  By Manoj
  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే గుర్తింపు దక్కించుకున్న మేల్ యాంకర్లలో రవి ఒకడు. చాలా కాలం కిందట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పాపులారిటీని సైతం సంపాదించుకున్నాడు. వరుసగా టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీగా గడుపుతున్న అతడు.. పలు వివాదాల్లోనూ చిక్కుకుంటున్నాడు. తాజాగా అతడు ఈ కారణంగానే పోలీస్‌ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంతకీ ఏమైంది.? రవి ఎందుకు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  రవికి ప్లస్ అండ్ మైనస్ అయింది ఆ షోనే

  రవికి ప్లస్ అండ్ మైనస్ అయింది ఆ షోనే

  ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే స్టాండప్ కామెడీ షో ‘పటాస్'కు రవి హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో వల్ల రవికి మంచి పేరు రావడంతో పాటు బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా మరో యాంకర్ శ్రీముఖితో కలిసి చేసిన కొన్ని ఎపిసోడ్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

  వివాదాలతో సహవాహం.. అది పెద్దది

  వివాదాలతో సహవాహం.. అది పెద్దది

  రవికి వివాదాలు కొత్త కాదు. అతడి కెరీర్‌లో చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. వీటిలో ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ రవిపై మహిళా సంఘాలు గొడవలు చేయడం మాత్రం ఆగలేదు. చాలా రోజుల తర్వాత దీనికి పుల్‌స్టాప్ పడింది.

  పటాస్‌కు టాటా.. కారణం శ్రీముఖే

  పటాస్‌కు టాటా.. కారణం శ్రీముఖే

  చాలా కాలం పాటు ‘పటాస్' షోకు హోస్ట్‌గా వ్యవహరించిన రవి.. ఇటీవల దాని నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీనికి కారణం మరో యాంకర్ శ్రీముఖి అన్న టాక్ వినిపించింది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిపోయిన తర్వాత ‘పటాస్' టీఆర్పీ రేటింగ్ బాగా తగ్గిపోవడం వల్లే రవి కూడా టాటా చెప్పేశాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అతడు మరో చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

  పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కిన యాంకర్ రవి

  పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కిన యాంకర్ రవి

  తాజాగా యాంకర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తాను హీరోగా పరిచయం అయిన ‘ఇది మా ప్రేమకథ' సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ తనను మోసం చేశాడని ఫిర్యాదు చేసేందుకు రవి కూకట్‌పల్లి పీఎస్‌కు వెళ్లాడు. సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ తనకు రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ యాంకర్.

  రవిపై కేసు పెట్టిన సందీప్.. హాట్ టాపిక్

  రవిపై కేసు పెట్టిన సందీప్.. హాట్ టాపిక్

  కొద్ది రోజుల క్రిందట సందీప్.. రవిపై కేసు పెట్టాడు. తనను డబ్బులు ఇవ్వాలని భయ పెడుతున్నాడని, లేని పక్షంలో చంపేస్తానని బెదిరిస్తున్నాడని అతడు రవిపై ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో కేసు పెట్టాడు. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. చాలా రోజుల తర్వాత రవి.. సందీప్‌పై కౌంటర్ కేసు వేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగినట్లైంది.

  Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show
  ఈ వివాదానికి అసలు కారణం అదే

  ఈ వివాదానికి అసలు కారణం అదే

  రవి హీరోగా పరిచమవుతూ నటించిన చిత్రం ‘ఇది మా ప్రేమకథ'. శశిరేఖా పరిణయం సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అయోధ్య కార్తీక్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. మత్స్య క్రియేషన్స్, పీఎల్‌కే ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతోనే రవి, సందీప్ మధ్య వివాదం రేగిందని టాక్.

  English summary
  Other than anchoring he also worked on too many TV shows, movies. Here is a movie in which Ravi is working in the lead role – Idi Maa Prema Katha. Its a drama and romance movie, people loved the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X