పాదాలు పట్టుకోవడం, కాళ్లు ఒత్తడం.. లేడీ యాంకర్‌కు ఓ రేంజ్‌లో సపర్యలు చేసిన రవి
బుల్లితెరపై మన్మథుడిగా లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రవి.. స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నాడు. స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో సమ్‌థింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన రవి.. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. రవి-లాస్య అంటూ ఓ సమయంలో బుల్లితెరపై క్రేజీ జంటగా మార్మోగిపోయింది. ఆపై రవి.. శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ వంటి వారితోనూ షోలు చేసి సక్సెస్ అయ్యాడు.

కెమిస్ట్రీలో కింగ్..
యాంకర్ రవికి ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. యాంకర్ రవి ఉన్నాడంటే పక్కనే ఓ లేడీ యాంకర్ ఉండాల్సిందే. అలా యాంకరింగ్‌లో లాస్య, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ, భాను శ్రీ వంటి వారు వచ్చారు. తాజాగా మరో కొత్త యాంకర్ కూడా వచ్చి చేరింది.

నువ్వు రెడీ నేను రెడీ..
భార్యా భర్తలతో ఆడించేందుకు నువ్వు రెడీ నేను రెడీ అనే షోను యాంకర్ రవి, వింధ్య మేడపాటిలతో ప్రారంభించారు. ఇక ఈ ఇద్దరి యాంకరింగ్‌లో ఇటీవలె ప్రారంభమైన ఈ షో బాగానే వర్కౌట్ అవుతోంది. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ షోకు హైలెట్‌గా నిలుస్తోంది.

ప్రమోషన్స్ కూడా భారీగానే..
నువ్వు రెడీ నేను రెడీ అనే షో ప్రారంభానికి ముందు గట్టిగానే ప్రమోషన్ చేశారు. ఇందులో యాంకర్ రవి భార్య నిత్య కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక భార్యలకే తన సపోర్ట్ అంటూ రవికి కౌంటర్ వేసింది. ఇక ఈ షోలో సెలెబ్రిటీలు జంటలు చేసే అల్లరి మామూలుగా ఉండదు.
Recommended Video

లేడీ యాంకర్‌కు సపర్యలు..
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో యాంకర్ రవి, వింధ్యలు సీతయ్య సినిమాలోని సమయానికి తగు సేవలు చేయనీ.. అనే పాటకు రెచ్చిపోయి నటించారు. ఇక యాంకర్ రవి అయితే.. ఏకంగా వింధ్య పాదాలు పట్టుకోవడం, కాళ్లు ఒత్తడం వంటివి చేసేశాడు. ఇక దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పైగా ఇది ఫస్ట్ షూట్ చేసిన ఎపిసోడ్ అని రవి చెప్పడం ఆశ్చర్యం.


Click it and Unblock the Notifications











