యాంకర్ లాస్యతో గొడవకు కారణం అదే.. సీక్రెట్ పెళ్లి గురించి యాంకర రవి
బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవి. ఆయన చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎదగాలని అడుగుపెట్టారు. ఏదోలా సినీ వరల్డ్ లోనే కెరీర్ ను లాగాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన స్టార్ యాంకర్ గా ఎదిగారు. బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. తన టాలెంట్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. ఇక యాంకర్ రవి తన గురించి అభిమానుల్లో ఉన్న సందేహాలను, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ రవి ముఖ్యంగా తన కెరీర్ గురించి మాట్లాడుకొచ్చారు. తన బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నించారంట. కొంత మంది స్నేహితుల ప్రోత్సాహం కారణంగా తన జర్నీ ప్రారంభం అయ్యింది. అప్పటికే తను కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు ఒక డ్యాన్స్ స్టూడియో కూడా ఉందని, పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉండే వాడినని చెప్పారు. ఇక రవి లక్ష్యం హీరోగా కావాలని ఉండిందంట. ఆ దిశగానే ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు.

ఆ క్రమంలోనే మా మ్యూజిక్ లో యాంకర్ గా అవకాశం అందుకున్నానని చెప్పారు. అప్పుడే సంథింగ్ స్పెషల్ టీవీ షోతో యాంకర్ గా అలరించినట్టు తెలిపారు. ఆ షోలోనే యాంకర్ లాస్య మంజునాథ్ తో కలిసి పని చేశామని అన్నారు. అయితే ఆమెతో నాకు పెద్దగా గొడవలు ఏమీ లేవని, చిన్న పిల్లల కొట్లాటలే అని చెప్పారు. సంథింగ్ స్పెషల్ షోలో యాంకర్ గా చేసేటప్పుడు నీకు ఎక్కువ క్రేజ్ వచ్చిందా? నాకు వచ్చిందా? అంటూ పొట్లాడే వాళ్లం. అలాంటి గొడవలు తప్పా వేరేవేవీ లేదు.
కానీ అలా ఈగోకు పోయిన ఏడాదిన్నర పాటు మేం మాట్లాడుకోలేదు. కానీ ఎవరి దారిలో వారిమి ముందుకు వచ్చిన తర్వాత కెరీర్ అర్థమైన కొద్దీ ఇంత చిన్న విషయాలకు గొడవ పడేవాళ్లమా? అని అనిపించింది. ఆ తర్వాత మళ్లీ మా టీవీలోనే ఇద్దరం కలిసి షోలు కూడా రన్ చేశాం. ప్రస్తుతం ఫ్రెండ్లీగానే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. ఇక మరోవైపు తన సీక్రెట్ మ్యారేజ్ పైనా కూడా స్పందించారు. ఎందుకు తన పెళ్లిని రహస్యంగా ఉండచుకోవాల్సి వచ్చిందనే దానిపై వివరణ ఇచ్చారు.
తన కెరీర్ ప్రారంభంలో సంథింగ్ స్పెషల్ షో సమయంలోనే తనకు మ్యారేజ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పెళ్లయితే ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందని భయపడ్డాను. అప్పుడు చాలా ఎక్కువ ఆలోచించాను. కానీ, అది తప్పని ఇప్పుడు అర్థమైంది. నా లక్ష్యం హీరో కావడంతో పెళ్లైందని తెలిస్తే సినిమా అవకాశాలు తగ్గిపోతాయని అనుకున్నాను. కానీ అది పూర్తిగా తప్పని తెలుసుకున్నాను. కానీ నా భార్య నిత్య పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఎంతో సపోర్టివ్ గా ఉందని చెప్పుకొచ్చారు. ఇక జీవితంలో ఎవ్వరికైనా డబ్బులతోనే విలువ ఉంటుందని, డబ్బు లేకపోతే అసలు మర్యాద దొరకదని చెప్పారు. అలాగే బిగ్ బాస్‌లో లోబోతో పరిచయం బంధంగా మారిందన్నారు. బయట చాలా కామెడీ చేస్తాడని చెప్పారు. ఇక హౌజ్ లో చూపించేదంతా నిజం కాదని, ఎడిటింగ్లో మార్పులు ఉంటాయని తెలిపారు. ఏదేమైనా మనం కష్టపడి పనిచేయాలి. ఫలితం ఎలా ఉన్నా మన ప్రయత్నం మనం చేయాలని అన్నారు. సక్సెస్ అంటే ఏమిటో ఎవరికి వారు నిర్వచించుకోవాలని, తన వరకు మనశ్శాంతితో ఉండటమే అసలైన విజయమని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











