For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ ప్రైజ్‌పై రవి సంచలన వ్యాఖ్యలు: వాళ్లు ఇచ్చినప్పుడు కదా అంటూ నోరు జారడంతో!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది లేడీ యాంకర్ హవాను చూపిస్తున్నారు. అయినప్పటికీ సుదీర్ఘ కాలంగా తనదైన శైలి హోస్టింగ్‌తో నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు రవి. వాక్చాతుర్యంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని సైతం పొందాడు.

  అలాగే, వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా వెళ్లిన అతడు.. పన్నెండో వారమే బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ గిఫ్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన రవి

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన రవి

  ఇటీవల ముగిసిన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో.. అతడికే ఎక్కువ హైప్ లభించింది. దీంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

  మళ్లీ రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: మేకప్ రూమ్‌లో ముందూ వెనకా చూపిస్తూ ఘోరంగా!

  ప్రశంసలు... విమర్శలతో సాగి

  ప్రశంసలు... విమర్శలతో సాగి

  హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే యాంకర్ రవి తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అలాగే, గొడవలను ఆపుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, క్రమంగా అతడి ప్రవర్తనలో మార్పులు రావడంతో కొన్ని గొడవల్లో భాగం అయ్యాడు. దీంతో చెడ్డ పేరును కూడా తెచ్చుకుని విమర్శలను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డాడు.

  అనూహ్యంగా షో నుంచి ఔట్

  అనూహ్యంగా షో నుంచి ఔట్

  హౌస్‌లో ఉన్నప్పుడు రవికి అందరితో అనుబంధం ఏర్పడింది. కానీ, ఎందుకనో అతడు ప్రభావితం చేస్తుంటాడని, గుంటనక్క అని, గొడవలు పెడుతుంటాడని.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువైపోయాయి.టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి.. ఊహించని విధంగా 12వ వారమే ఎలిమినేట్ అయిపోయాడు.

  బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

  బయటకు వచ్చాక ఫుల్ బిజీ

  బయటకు వచ్చాక ఫుల్ బిజీ

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి చాలా రోజుల పాటు తన కుటుంబంతోనే సమయాన్ని గడిపాడు. ఈ క్రమంలోనే మాల్దీవులు ట్రిప్ కూడా వెళ్లాడు. అనంతరం కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' షోతో పాటు కొన్ని ఈవెంట్లు కూడా చేస్తున్నాడు. ఇలా తన వర్క్‌తో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయాడు.

  షోలో ఆ ఆఫర్ గెలిచిన రవి

  షోలో ఆ ఆఫర్ గెలిచిన రవి

  బిగ్ బాస్ షోలో దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో హీరోయిన్ శ్రీయ ఒక టాస్క్ ఇచ్చింది. ఇందులో యాంకర్ రవి, జెస్సీ జోడీ విజేతలుగా నిలిచింది. దీంతో మోజ్ ప్రమోషన్‌లో భాగంగా వీళ్లిద్దరికీ ఫారెన్ ట్రిప్ వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు శ్రీయ ప్రకటించింది. ఇక, బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే రవి, జెస్సీ కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళ్లే ఛాన్స్ ఉందని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది.

  యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

  బిగ్ బాస్ ప్రైజ్‌పై ప్రశ్నలు

  బిగ్ బాస్ ప్రైజ్‌పై ప్రశ్నలు

  సోషల్ మీడియాలో యాంకర్ రవి ఎంత బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఇందులో ఒక ఔత్సాహిక నెటిజన్ 'బిగ్ బాస్ ఐదో సీజన్‌‌లో ఉన్నప్పుడు మీకు, జస్వంత్ పడాలకు ఫారెన్ ట్రిప్ వెళ్లే ఆఫర్ వచ్చింది కదా.. ఎక్కడికి వెళ్లారు' అని సూటిగా ప్రశ్నించాడు.

   ఫారెన్ ట్రిప్‌పై రియాక్షన్‌తో

  ఫారెన్ ట్రిప్‌పై రియాక్షన్‌తో

  సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు యాంకర్ రవి స్పందిస్తూ.. 'ఆ.. వచ్చిందిలే.. వాళ్లు ఇచ్చినప్పుడు.. మేము పోయినప్పుడు. ఇప్పుడు కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికీ వెళ్లే ఛాన్స్ లేదు. కొన్ని రోజుల తర్వాత ఆఫర్ ఇస్తారేమో చూడాలి' అంటూ నోరు జారి కవర్ చేసుకున్నాడు. దీంతో అసలు ఆ ఆఫర్ అంతా ఫేక్‌దే అని పరోక్షంగా సమాధానం చెప్పాడు ఈ యాంకర్.

  English summary
  Anchor Ravi and Jaswanth Padala Won Moj Freign trip in Bigg Boss 5th Season. Now Ravi Did Shocking Comments on This Offer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X