»   » ఆ బాడీకి నా ఫేస్ అతికించి.. నా భర్తే చూశాడు.. చాలా దారుణం.. యాంకర్ శ్యామల ఆవేదన

ఆ బాడీకి నా ఫేస్ అతికించి.. నా భర్తే చూశాడు.. చాలా దారుణం.. యాంకర్ శ్యామల ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Syamala Shares Her Personal Life Things

తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. అటు టెలివిజన్ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ ఆమె ఆకట్టుకొంటున్నది. ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల వెల్లడించిన విషయాలు ఇవే..

సోషల్ మీడియాపై యాంకర్ శ్యామల

సోషల్ మీడియాపై యాంకర్ శ్యామల

సోషల్ మీడియాకు సంబంధించి పాజిటివ్, నెగిటివ్ అంశాలున్నాయి. ప్రజలు, ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి చాలా ఉపయోగంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఓసారి బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ అతికించి పోస్ట్ చేశారు. అది నా భర్త నా దృష్టికి తీసుకురావడం ఇంకా బాధ కలిగింది.

నా భర్త అర్థం చేసుకోవడంతో

నా భర్త అర్థం చేసుకోవడంతో

నా భర్త కూడా సినీ, టెలివిజన్ పరిశ్రమకు సంబంధించిన వారు కావడంతో నన్ను అర్థం చేసుకొన్నాడు. బయటి వ్యక్తి అయితే నా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అలాగే చాలా చెండాలమైన ఫొటో పెట్టి ఆఫర్లు తగ్గాయి అందుకే ఇలాంటి వేషాలు అని హెడ్‌లైన్ పెట్టారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి.

నెగిటివ్ కామెంట్స్‌పై శ్యామల

నెగిటివ్ కామెంట్స్‌పై శ్యామల

సోష్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లను చూస్తే బాధ కలుగుతుంది. తొలుత బాధ ఉన్నా.. ఆ తర్వాత వదిలేయడం అలవాటైపోయింది. నా ప్రొఫెషన్ విషయంలో నా భర్త ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. నాకు చాలా సహకారం అందిస్తాడు.

యాంకర్లందరితో కంఫర్టబుల్

యాంకర్లందరితో కంఫర్టబుల్

ప్రదీప్, సుమ, లాస్య, రవి లాంటి యాంకర్లందరూ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ప్రదీప్‌తో తొలిసారి అవార్డు ఫంక్షన్‌లో హోస్ట్‌గా వ్యవహరించాను. అప్పటికి నాకు అవార్డు ఫంక్షన్లను నిర్వహించే అనుభవం లేదు. ప్రదీప్ ఆ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. ప్రదీప్ చాలా క్లాస్‌గా వ్యవహరిస్తాడు.

రవి రెడ్‌బుల్ తాగినట్టు

రవి రెడ్‌బుల్ తాగినట్టు

యాంకర్ రవితో చేయడం చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. యాంకరింగ్ చేసేటప్పుడు రెడ్‌బుల్ తాగి ఫుల్ ఎనర్జీతో ఉన్నట్టు కనిపిస్తాడు. ఫుల్ జోష్‌తో ఉంటాడు. రవితో యాంకర్ చేయాల్సి వచ్చినప్పుడు రీచార్జీ అయి పోతాను.

మహేష్‌బాబు అంటే ఇష్టం

మహేష్‌బాబు అంటే ఇష్టం

తెలుగు హీరోల్లో మహేష్‌బాబు, షారుక్ ఖాన్ అంటే ఇష్టం. హీరోయిన్లలో సౌందర్య, సిమ్రాన్, ప్రస్తుతం అనుష్క అంటే ఇష్టం. యాంకర్లలో ప్రదీప్, రవిని ఇష్టపడుతాను. నేను సారీ చెప్పాల్సి వస్తే మా అమ్మకు చెబుతాను. పెళ్లి విషయంలో ఆమెను బాధపెట్టాను అని శ్యామల చెప్పింది.

పెళ్లి చేసుకోవడంపై శ్యామల

పెళ్లి చేసుకోవడంపై శ్యామల

నాకు 19 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. ఆ తర్వాత రెండేళ్లపాటు ఎందుకు పెళ్లి చేసుకొన్నానురా బాబు అనే ఫీలింగ్ కలిగింది. చిన్న వయసులో పెళ్లి జరుగడం వల్ల ఆ ఫీలింగ్ కలిగింది. జీవితంలో అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది.

English summary
Anchor Syamala made her mark in Telugu television with her own talent. She has hosted many TV shows and worked with many leading actors in supporting roles. Shyamala spoke to a youtube media channel and share her personal life things.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu