Don't Miss!
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి
ఎవరూ చేయలేని విధంగా వరుసగా షోల మీద షోలు చేస్తూ తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతోంది బోల్డు బ్యూటీ శ్రీముఖి. ఏ ఛానెల్ చూసినా.. ఏ షో చూసినా ఆమె అన్నట్లుగా హల్చల్ చేస్తోంది. ఫలితంగా ప్రేక్షకులకు నిత్యం టచ్‌లోనే ఉంటూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఆమె వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ మరింతగా హైలైట్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ శ్రీముఖి ఓ షోలో ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్‌ను వింత ప్రశ్న అడిగి షాకిచ్చింది. అసలేం జరిగిందంటే....

వరుస షోలతో శ్రీముఖి సందడి
ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం', 'బీబీ జోడీ' వంటి షోలు చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది. వీటితో పాటు కొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తోంది.
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

అవినాష్‌తో కలిసి పరివారంగా
ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా ఛానెల్‌లో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి సండే ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో బుల్లితెర ప్రముఖులు గెస్టులుగా వచ్చి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో శ్రీముఖితో పాటు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా సందడి చేస్తోన్నాడు. ఇలా వీళ్లిద్దరూ ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో మజాను పంచుతున్నారు.

రెండు టీమ్‌లతో పోటాపోటీగా
గత ఆదివారం జరిగిన 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో బుల్లితెర నటులు సందడి చేశారు. అందులో 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు', 'కృష్ణ ముకుందా మురారి' సీరియల్‌లోని నటీనటులు రెండు టీమ్‌లుగా ఏర్పడి పోటీ పడ్డారు. వీళ్లతో యాంకర్ శ్రీముఖి ఎన్నో గేమ్స్ ఆడించింది. అలాగే, అవినాష్ కామెడీతో ఈ షో మొత్తం రసవత్తరంగా సాగుతూనే నవ్వు తెప్పించింది.
బ్రాలో షాకిచ్చిన డీజే టిల్లు హీరోయిన్: అలా తెగించి మరీ అందాల ఆరబోత

ఆమెను పడేసిన కమెడియన్
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా ముక్కు అవినాష్ కొందరు నటీమణులను ఎత్తుకుని గాల్లో తిప్పాడు. అలా ఏకంగా ముగ్గురు బ్యూటీలతో అతడు సందడి చేశాడు. ఈ క్రమంలోనే ఒకరిని ఎత్తుకునే సమయంలో పట్టుతప్పి కింద పడేశాడు. అయినప్పటికీ మళ్లీ ప్రయత్నించాడు. అలా ఆమెను కూడా గాల్లో తిప్పాడు. ఇదంతా ఎంతో సరదాగా సాగిపోయింది.

అవినాష్‌కు శ్రీముఖి ప్రశ్నలు
అమ్మాయిలను ఎత్తుకున్న అవినాష్ దగ్గరకు వచ్చిన యాంకర్ శ్రీముఖి 'నిన్ను పర్సనల్‌గా ఒక క్వశ్చన్ అడుగుతా. నిజంగా సమాధానం చెప్పాలి. ఒక ఫ్రెండ్‌గానే నిన్ను ఇది అడుగుతున్నా.. పెళ్లైన తర్వాత మీ ఆవిడ అనూజాను ఎన్నిసార్లు ఎత్తుకుని ఉంటావు. నిజం చెప్పు.. లేకుంటే నేను మీ ఆవిడకు ఫోన్ చేసి అడుగుతా' అని అంది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!
లైవ్‌లో ఆమెకు ఫోన్ చేసి మరీ
చాలా సేపు ఆలోచించిన తర్వాత ముక్కు అవినాష్ 'ఒక ఆరు ఏడు సార్లు తనను ఎత్తుకుని ఉంటాను' అని చెప్పాడు. దీంతో శ్రీముఖి వెంటనే అతడి భార్యకు ఫోన్ చేసి 'ఇప్పటి వరకూ అనినాష్ నిన్ను ఎన్నిసార్లు ఎత్తుకున్నాడు' అని అడిగింది. దీంతో ఆమె 'మూడు నాలుగు సార్లు ఎత్తుకున్నాడు' అని చెప్పింది. దీంతో అక్కడున్న వాళ్లు అవినాష్‌పైకి దూసుకు వచ్చారు.

వచ్చాక అలా చేయాలంటూ
తన భార్య చెప్పిన ఆన్సర్‌తో బుక్కైన అవినాష్.. 'నిన్ను అప్పుడు ఎత్తుకున్నా కదా. మెట్లు దగ్గర ఎత్తుకుని ఎక్కించా కదా' అంటూ కవర్ డ్రైవ్‌లు వేశాడు. దీంతో ఆమె 'కలలో రెండు సార్లు ఎత్తుకున్నాడు అనుకుంటా. సరే.. అయితే ఇంటికి వచ్చాక వంద సార్లు ఎత్తుకో' అని బాంబ్ పేల్చింది. మొత్తానికి ఇదంతా సరదాగానే సాగినా.. శ్రీముఖి ప్రశ్నపై కొందరు కోప్పడుతున్నారు.