Don't Miss!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
పెళ్లి విషయం దాచిపెట్టడంపై కౌంటర్.. అందరి ముందు రవి పరువుదీసిన సుమ
యాంకర్ రవి పెళ్లి విషయం ఒకానొక సందర్భంలో భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. బుల్లితెరపై యాంకర్లతో రవి అఫైర్లంటూ రూమర్లు బయటకు వస్తుండేవి. లాస్య, శ్రీముఖిలతో వ్యవహారం చాలాదూరం పోయిందంటూ ఓ వైపు పుకార్లు పుడుతూ ఉంటే.. ఆల్రెడీ రవికి పెళ్లైపోయిందని, పాప కూడా ఉందనే రూమర్లు వచ్చేవి. అసలు ఏది నిజం ఏది అబద్దం అని నెటిజన్లు తలలగోక్కునే వారు. రవి పెళ్లి సమస్య అంతటి హాట్ టాపిక్ మరోటి లేదన్నట్టుగా ఉండేది.

ఎక్కడకు వెళ్లినా..
యాంకర్ రవి ఎక్కడకు వెళ్లినా కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురుయ్యేవి. సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చినా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినా కూడా అదే ప్రశ్న ఎదురయ్యేది. ఇక ఈ పోరు భరించలేక చివరకు నోరు విప్పాడు. అయితే అది కూడా ఎంతో కాలం తరువాత గానీ అసలు విషయం చెప్పలేదు.

అలా బయటపెట్టేశాడు..
రవి తనకు పెళ్లైన విషయాన్ని ఎంతో క్రియేటివ్‌గా చెప్పేశాడు. తన భార్య, పాపతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి అసలు సంగతి చెప్పేశాడు. అలా యాంకర్ రవి తన ఫ్యామిలీని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కారణంగానే మరింత ఫేమస్ అయ్యాడు.
Recommended Video

వియా, నిత్యలతో..
యాంకర్ రవి తన కూతురు వియా, భార్య నిత్యలతో చేసే వీడియోలు, ఆ ముగ్గురి మధ్య ఉన్న అనుబంధంతో రవి మరింత ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు యాంకర్ రవికి తన ఫ్యామిలీయే బలంగా మారింది. ముఖ్యంగా తన పాపతో రవి చేసే అల్లరిని అందరూ ఇష్టపడుతుంటారు.

తాజాగా సుమ అలా..
సుమ, రవి కలిసి బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో రవి, సుమలు వేసే పంచ్‌లు బాగానే పేలుతున్నాయి. వచ్చే వారం రాబోతోన్న షోకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో సుమ రవి పెళ్లిపై కౌంటర్ వేసింది.

అదే పెద్ద చాలెంజ్..
లైఫ్‌లో పెద్ద చాలెంజ్ ఏంటని రవిని సుమ అడిగింది. పెళ్లి చేసుకోవడం అని రవి సెటైర్ వేశాడు. అవునవును.. ఆ పెళ్లిని దాచిపెట్టడం ఓ చాలెంజ్.. మళ్లీ అందరి ముందు చెప్పడం ఓ చాలెంజ్... అసలు నీ పెళ్లి నీకు చాలెంజ్ కాదు.. మాకు చాలెంజ్ అంటూ వరుసగా సెటైర్లు వేయడంతో రవి దెబ్బకు నోర్మూసుకున్నాడు.