For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ సుమ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా.. డైరెక్టర్, హీరో ఎవరో తెలుసా?

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది యాంకర్స్ ఇప్పుడు గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు కానీ మాటలతో ఎక్కువగా ఆకట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో యాంకర్ సుమ ఒకరు. తన సెన్సాఫ్ హ్యూమర్ తో టెలివిజన్ షోలకు మంచి రేటింగ్ అందించగల సుమ అంటే దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ ఒక ఇంట్లో మెంబెర్ గా మారిపోయారు. అయితే మొదట ఆమె హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు వేశారు. ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేసిన సుమ డిజాస్టర్ అందుకుంది. ఇక ఆ సినిమా హీరో ఎవరు దర్శకుడు ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

  మోస్ట్ పాపులర్ యాంకర్

  మోస్ట్ పాపులర్ యాంకర్

  తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ యాంకర్ గా గుర్తింపును అందుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సినిమా ఈవెంట్స్ చేసినా టెలివిజన్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన కూడా సక్సెస్ కావాల్సిందే. తను మాటలతోనే ఎంతగానో ఆకట్టుకుంటూ అప్పుడప్పుడు కామెడీ పంచులతో కూడా నవ్విస్తూ ఉంటారు.

  అలా యాంకర్ గా ఫస్ట్ స్టెప్

  అలా యాంకర్ గా ఫస్ట్ స్టెప్

  ఇక సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె టీనేజ్ వయసులో నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఆమె మొదటిసారి ఒక సినిమా ఈవెంట్ కు హోస్ట్ వ్యవహరించారు. ఆ తర్వాత కంటిన్యూగా సినిమాలకు ఆమెను స్పెషల్ యాంకర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.

  టాప్ రెమ్యునరేషన్

  టాప్ రెమ్యునరేషన్

  దాదాపు రాజమౌళి, కే రాఘవేంద్రరావు సినిమాలన్నీటికి కూడా సుమా యాంకర్ గా ఉండాల్సిందే. ఇక ఆ తర్వాత చాలామంది దర్శకులు హీరోలు కూడా సుమను స్పెషల్ యాంకర్ గా సెలక్ట్ చేసుకునేవారు. ఇక టెలివిజన్ లోకి అడుగుపెట్టిన తర్వాత సుమా చాలా బిజీగా మారిపోయింది. ఆమె టెలివిజన్ షోలకు అయినా సరే సినిమా ఈవెంట్స్ కు అయినా సరే ఒక రోజుకు 2 లక్షల వరకు పారితోషకం అందుకుంటూ టాప్ యాంకర్లలో ఒకరిగా క్రేజ్ అందుకుంటున్నారు.

  ఆ సినిమాలో హీరోయిన్

  ఆ సినిమాలో హీరోయిన్

  అయితే యాంకర్ సుమ కెరీర్ మొదట్లో హీరొయిన్ గా కూడా ఒక అడుగు వేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో యాంకర్ సుమ హీరోయిన్ గా నటించింది. 1996లో వచ్చిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ సుమకు మాత్రం ఆ తరువాత మిగతా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసేందుకు చాలా ఆఫర్స్ వచ్చాయి.

  హీరో ఎవరంటే?

  హీరో ఎవరంటే?

  ఇక కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ సినిమాలో హీరోగా నటించింది ప్రస్తుతం రచయితగా దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వక్కంతం వంశీ. ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు కథలో అందిస్తూ ఉంటాడు. అతనొక్కడే, కిక్, ఊసరవెల్లి, టెంపర్, ఏజెంట్ సినిమాలకు వక్కంతం వంశీ కథలో అందించాడు.

   రచయిత నుంచి దర్శకుడిగా..

  రచయిత నుంచి దర్శకుడిగా..

  ఇక మొదట అతడు నటుడిగా కొనసాగాలని అనుకొని కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా ట్రై చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత తనకు ఇష్టమైన రచయితగా కొనసాగాడు. ఇక రచయితగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వంశీ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఆ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నితిన్ తో అతను ఒక సినిమా చేస్తున్నాడు.

  English summary
  Anchor suma first movie as a heroine behind the story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X