For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆరోజు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన సుమ: రౌండప్ చేసి మరీ చూపిస్తూ.. ఆ భారీ ప్రకటన అతడి గురించేనా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. గ్లామర్ ఫీల్డులో తమ అందచందాలతో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ, వాళ్లలో ఎవరూ నెంబర్ వన్ ప్లేస్‌ను అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ సీనియర్ టాలెంటెడ్ యాంకర్ సుమ కనకాల పాతుకూపోయి ఉండడమే. చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తోన్న ఆమె.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండిపోతోంది. ఇక, తాజాగా యాంకర్ సుమ సోషల్ మీడియోలో ఓ సర్‌ప్రైజింగ్ వీడియోను షేర్ చేసింది. అసలేంటా వీడియో? పూర్తి వివరాలు మీకోసం!

  అందుకే నెంబర్ వన్ స్థానలో సుమ

  అందుకే నెంబర్ వన్ స్థానలో సుమ

  బుల్లితెరపై యాంకరింగ్‌కు కూడా గతంలో కంటే ఇప్పుడు పోటీ భారీగా పెరిగిపోయింది. చాలా మంది అమ్మాయిలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఎవరూ సుమను మ్యాచ్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఆమె టైమింగ్‌ను అందుకోలేకపోవడమే. ఈ కారణంగానే సుమ ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్‌లోనే ఉంటోంది. తద్వారా తనకు తానే సాటి అని నిరూపిస్తోంది.

  అన్నింట్లోనూ ఉంటూ సందడి చేస్తూ

  అన్నింట్లోనూ ఉంటూ సందడి చేస్తూ

  యాంకర్‌గా ఎప్పుడైతే అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి సుమ హవాను చూపిస్తూనే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా దశాబ్ద కాలంగా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఏ చానెల్‌లో చూసినా కనిపించేలా షోలు ఒప్పుకోవడమే కాదు.. స్పెషల్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లలోనూ ఆమెదే రాజ్యం అయిపోయింది. అలాగే, వ్యాపార ప్రకటనలు, యూట్యూబ్ వీడియోలు వదులుతోంది.

  సినిమాల్లోకి మాత్రం వెళ్లని యాంకర్

  సినిమాల్లోకి మాత్రం వెళ్లని యాంకర్

  సుమ కనకాలకు ఎన్ని టాలెంట్లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ ఆమె బుల్లితెరపైనే ఉంటోంది కానీ, సినిమాల్లోకి మాత్రం వెళ్లడం లేదు. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో కనిపించిన ఈమె.. చాలా కాలంగా దానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే మంచి మంచి ఆఫర్లను సైతం వదులుకుంటోంది. అయితే, ‘విన్నర్' మూవీ కోసం ఓ పాటను పాడి మెప్పించింది.

  బుల్లితెరపై హవా.. వరుస ప్రోగ్రామ్‌లు

  బుల్లితెరపై హవా.. వరుస ప్రోగ్రామ్‌లు

  యాంకర్ సుమ కనకాల ప్రస్తుతం ఏక కాలంలో ఎన్నో షోలను హోస్ట్ చేస్తోంది. ‘క్యాష్', ‘స్టార్ట్ మ్యూజిక్' సహా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తోంది. తద్వారా పలు ఛానెళ్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే జీ తెలుగు ఛానెల్‌లో ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే స్పెషల్ షోను కూడా నడిపిస్తోంది. వీటితో పాటు మరికొన్ని షోలను కూడా హోస్ట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తోంది.

  అందులో ఫుల్ బిజీగా ఉంటూ రచ్చ

  అందులో ఫుల్ బిజీగా ఉంటూ రచ్చ

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాంకర్ సుమ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఓపెన్ చేసేసింది. అలాగే, తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

  సర్‌ప్రైజ్ అంటూ వీడియోను వదిలింది

  సర్‌ప్రైజ్ అంటూ వీడియోను వదిలింది

  తాజాగా యాంకర్ సుమ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె క్యాలెండర్ ముందు నిల్చుని కొన్ని డేట్లను సెలెక్ట్ చేసుకోవాలని చూసింది. అన్నింటినీ కాదని జూలై ఒకటవ తేదీని సెలెక్ట్ చేసుకుంది. అంతేకాదు, దానికి రౌండప్ చేసింది. ఇక, దీనికి ‘జూలై 1న ఆసక్తికరమై ప్రకటన చేయబోతున్నా.. వేచి ఉండండి' అంటూ చెప్పుకొచ్చిందీ టాప్ యాంకర్.

  అతడి గురించేనా అని అనుమానాలు

  అతడి గురించేనా అని అనుమానాలు

  ఈ వీడియో బయటకు వచ్చిన తర్వత సుమ చెప్పిన తేదీన ఎలాంటి ప్రకటన చేస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ఆమె కొడుకు ఇషాన్ సినిమా గురించి ఏదైనా అనౌన్స్ చేయబోతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం సుమ కొత్త షో ప్రకటన అయి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆరోజు ఈ యాంకర్ ఏం చెబుతుందో!

  English summary
  Telugu Top Anchor Suma Kanakala Now Doing So Many Shows in Few Channels. Now She Shared One Surprising Video In Social Media Accounts
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X